Khichdi News
Movie Reviews
Ninnu Kori
Ninnu Kori
Jul 06 2017 | Gopi CH
Editors Rating:
3.50
3.5/5
Cast: Nani ,Nivedita's
Director: Siva Niravana
GENRE: Love,Family
DURATION: 2 hour(s) 20 minutes
Release Date: Jul 06 2017
Editors Review

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత సరళం !

తీరం దాటని గత  ప్రేమల ను వాటి తాలూకా  జ్ఞాపకాలను,తీపి గుర్తులను  ,మాని మానని గాయాలను,వాటి  బాధలను  హీరో నాని  మళ్ళి  తట్టి లేపుతూ

మనల్ని రెప్పల చాటు న  కన్నీళ్లు  పెట్టిస్తుంటాడు,మనసు ను తడి చేస్తుంటాడు  ...ఈ మధ్య  తీసిన  మజ్ను ఒకటి కాగా  , ఇప్పుడు  "నిన్ను కోరి". 

చూడడానికి వెన్నెల సినిమా లోని శర్వానంద్ పాత్ర  లాగ అనిపిస్తూ .. 'అభినందన'  ఛాయలో కార్తీక్ పాత్ర వలే   నడుస్తున్నట్టే వుండి ..  మహర్షి రాఘవ పాత్రను కూడా గురుతు చేస్తూ సడన్ గా క్లైమాక్స్ సుఖాంతం అవడం తో ఊపిరి పీల్చుకొనేలాగా చేస్తుంది .  సినిమా చుసిన తరువాత కూడా నాని పాత్ర మనల్ని టచ్ చేస్తూ ,గుండెల్లో తడి తెప్పిస్తుంది .నాని ,నివేదిత థామస్ ,ఆది పినిశెట్టి  పోటా పోటీగా నటించి సినిమా ను  మరో ప్రపంచం లోకి తీసుకువెళుతారు . నివేదిత తన అసమాన నటనతో ప్రియురాలుగా ,గృహిణిగా  మరో సారి మనల్ని మెప్పింస్తుంది . 

గత కొన్ని సంవత్సరాలుగా అన్ని పాత్రలతో మెప్పిస్తూ వరుస  సూపర్ హిట్లు ఇస్తూ  తారాపథం లో దూసుకు పోతున్న నాని మరొక యువత ను ఆకర్షించే  పాత్రలో "నిన్ను కోరి " సినిమా స్టిల్ పోస్టర్ ను మొదట  ట్విట్టర్ లో లాంచ్ చేస్తూ ,వైజాగ్ నుంచి ఆమెరికా వరకు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు లవర్స్ నుంచి పెళ్ళైన వాళ్ళ వరకు చూడదగ్గ చిత్రం "నిన్ను కోరి " అంటూ  గతం లో ట్వీట్ చేశాడు. అన్నట్లే ఈ సినిమా లో అసభ్య కరమైన సన్నివేశాలు లేకుండా  తీశారు 

నాని ,నివేదిత థామస్ ,పినిశెట్టి పోటా పోటీగా నటించి సినిమా ను  మరో ప్రపంచం లోకి తీసుకువెళుతారు  . సరదాగా ఈ  వీకెండ్ ఈ సినిమా చూచేయండి !

A pleasant feel good film with very nice emotions Go for it.

Latest News
Political News
Entertainment
PHOTO GALLERY

Photo Comment
Spiritual