Khichdi News
Movie Reviews
Anando Brahma
Anando Brahma
Aug 18 2017 | Gopi CH
Editors Rating:
3.50
3.5/5
Cast: Taapsee Pannu, Srinivas Reddy, Vennela Kishore, Thagubothu Ramesh, Shakalaka Shankar, Rajeev Kanakala, Posani Krishna Murali, Tanikella Bharani, Vidyulleka Raman, Prabhas Srinu, Raghu Karumanchi, Vijayachandar, Shashank, Tarzan, Raja Ravinder,
Director: Mahi V Raghav
GENRE: Horror comedy
DURATION: 2 hour(s) 20 minutes
Release Date: Aug 18 2017
Editors Review

ఆనందో బ్రహ్మ హారర్ హాస్యం అదరహో !

70 ఎం ఎం ఎంటర్ టైన్ మెంట్ వారి ద్వితీయ చిత్రం హారర్ కామెడీ 'ఆనందో బ్రహ్మ'  వర్ధమాన దర్శకుడు  మహి రాఘవ దర్శకత్వంలో బాలీవుడ్ లో ఈ మధ్య సంచలన  హీరోయిన్  తాప్సి మళ్ళి తెలుగులో ప్రధాన పాత్రలో  నటించడం,పైగా  సినిమా టీజర్ బాగా పాపులర్ అవడం , పైగా హారర్ కామెడీ అవడం తో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. ఈ సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ హాజరవడం తో పేక్షకులలో బాగా ఆసక్తి కలిగడం విశేషం .. దాదాపు ఫామ్ లో వున్న అందరు కమెడియన్స్ ఈ సినిమా లో ప్రధాన పత్రాలు పోషిం చడం ఒక విశేషం . 

ఇక ఈ సినిమా మొదటి భాగం కొంచెం  స్లో గా ప్రారంభమయ్యి ... సెకండ్ హాఫ్ లో పూర్తి ఎంటర్ టైన్మెంట్ తో బాగా ఆకట్టుకొంటుంది . ఈ మధ్య దెయ్యాల సినిమా లలో ప్రధాన పాత్ర లు పోషిస్తున్న శ్రీనివాస్  రెడ్డి ,షకలక శంకర్ ,వెన్నెల కిషోర్ ,తాగుబోతు రమేష్ లు ఈ సినిమా లో కూడా మంచి కామెడీ తో అలరించారు . 

మలేషియా లో వున్న రాము (రాజీవ్ కనకాల ) తన తల్లి తండ్రులు  ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టు కు పోయి చనిపోయారని గ్రహించి వారి స్వంత ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని మిత్రుడు ఆ భవనం పై కన్నేసి తక్కువ ధరకు ఆ ఇంటిని కాజేయాలని ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు . 

ఇంతలో గుండే జబ్బు వున్న పాత్రలో శ్రీనివాస రెడ్డి , కొడుకు ఆపరేషన్ కోసం డబ్బు అవసరం వున్న తండ్రి  పాత్రలో  తాగుబోతు రమేష్ , ఎటిఎంకు  సెక్యూరిటీ గా వున్న వెన్నెల కిషోర్ ఆ ఎటిఎం దోపిడీకి గురవడం తో డబ్బులు చెల్లించాల్చి రావడం ,సినిమా పిచ్చితో వున్న షాప్ ను అమ్మి సినిమా ల లో అవకాశం కోసం బ్రోకర్ కి 10 లక్షలు కట్టి సర్వం పోగుట్టుకోనున్న షకలక శంకర్ లు తమ అవసరాలకు డబ్బు కోసం ఆ ఇంట్లో 4 రోజులు నిద్ర పోయి దెయ్యాలు లేవని నిరూపించి ఆ యజమాని దగ్గర ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తంలో  20% కమిషన్ ఈ కోసం  ఒప్పుకొంటారు . వీరు నిద్ర చేసిన మొదటి రోజే  శ్రీనివాస్ రెడ్డి  కి ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అవన్నీ ఒక ఫ్యామిలీ దెయ్యాలు  అని  గ్రహిస్తాడు.కుటుంబం క్రైమ్ లో బలైనా వారి గతం బయటపడుతుంది  అయితే  సినిమా లో తాప్సి రోల్ తక్కువే  

ముఖ్యంగా షకలక శంకర్ సినిమా నటుల అనుకరిస్తూ  చేసిన  కామెడీ,డాన్సులు బాగా కుదిరాయి  ,కొత్తగా కూడా వుంది,ముఖ్యంగా రాందేవ్ బాబా ను అనుకరిస్తూ చేసిన యోగాసనాలు బాగా నవ్విస్తాయి .KA పాల్ అనుకరణ కు థియేటర్ మొత్తం నవ్వులతో నిండింది .సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా ,అశ్లీలపు డైలాగ్ లు ,సంఘటనలు   లేకుండా సరదాగా సాగిపోతుంది ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీ ల వరవడిలో   ఆనందో బ్రహ్మ కామెడీ తో పాటు సెంటు మెంటు ని పండించి వీటిలో  ప్రత్యేకంగా   అనిపిస్తుంది .బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,కెమెరా వర్క్ ,ఎడిటింగ్  బాగుంది . 

అయితే అక్కడక్కడా సింక్ కుదరని సన్నివేశాలు చూస్తే  తక్కువ బడ్జెట్ తో సినిమా ని చుట్టేయడానికే దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చినట్లనిపిస్తుంది 

 

 

Latest News
Political News
Entertainment
PHOTO GALLERY

Photo Comment
Spiritual