Khichdi News
Movie Reviews
NOTA
NOTA
Oct 04 2018 | Gopi CH
Editors Rating:
3.75
3.75/5
Cast: Vijay Devarakonda, Mehreen Pirzada,Nazer
Director: Anand Shankar
GENRE: Political
DURATION: 2 hour(s) 20 minutes
Release Date: Oct 04 2018
Editors Review

సమకాలీన రాజకీయాలలో జరిగిన అన్ని ముఖ్యమైన ఘట్టాలన్నింటిని చక్కగా చిత్ర కథలో ఇమిడిపింపచేసి, ప్రేక్షకులని చివర వరకు విసుగు లేకుండా, ఆలోచించేసే ప్రయత్నం బాగుంది. ఇటీవల రాజకీయ నేపథ్యం లో హంగు ఆర్భాటం తో వచ్చిన చిత్రానికి భిన్నముగా, లోతైన, రాజకీయ కథ ని ఎంచుకొని, చక్కని కథనం, తారాగణం తో చేసిన కొత్తదైన ప్రయత్నం ఇది. ఇప్పటి వరకు ప్రతి చిత్రానికి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తున్న కథానాయకుడు, ఈ చిత్రం తో కూడా తన విలక్షణ శైలిని నిలబెట్టుకున్నాడు. చాల సన్నివేశాలు, సంభాషణలు (‘.....మన ఛానల్ మార్చు...’ లాంటివి) నేటి రాజకీయ పరిస్థితులని ప్రతిబింబచేస్తాయి. మొదటి భాగం తో పోలిస్తే, ద్వితీయ భాగంలో కథాగమనం లో కొద్దిగా పట్టు సడలినట్లు అనిపించినప్పటికీ, ముగింపు మూస ధోరణికి భిన్నముగా ఉంటుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంత ప్రేక్షకులు, మరీ ముఖ్యముగా కథానాయకుడిని ఒక అర్జున్ రెడ్డి, విజయ్ గోవింద్ పాత్రలలో ఊహించని స్థాయిలో ఆదరించిన యువతరం ఈ చిత్రాన్ని ఎంతవరకు ఆదరిస్తారు అనే దానిమీద చిత్ర విజయ పరిధి ఆధారపడివుంటుంది. అయితే ఒకసారి తప్పక చూడవచ్చు అనిపించినది.....
 

Latest News
Political News
Entertainment
PHOTO GALLERY

Photo Comment
Spiritual