Khichdi News
Movie Reviews
YAATRA
YAATRA
Feb 08 2019 | Gopi CH
Editors Rating:
3.72
3.72/5
Cast: Mammootty, Rao Ramesh, Jagapathi Babu, Anasuya, Suhasini, Posani Krishna Murali,
Director: Mahi V Raghav
GENRE: Political
DURATION: 2 hour(s) 6 minutes
Release Date: Feb 08 2019
Editors Review

70 MM Entertainment బ్యానర్ పై మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత  వైస్ రాజశేఖర్ రెడ్డి గారి  1475 కిలోమీటర్ల  చారిత్రాత్మక పాదయాత్ర కు  దృశ్య రూపంలో అందిస్తున్న "యాత్ర" సినిమా ప్రారంభం నుంచి విన్నూతన టీజర్ లతో ఆకట్టుకున్న విషయం విదితమే .  ఇక సినిమా ఎలా వుందో చూద్దాం !

దివంగత మాజీ  ముఖ్యమంత్రి  YS రాజశేఖరుని  జీవితంలో జరిగిన  అనేక సంఘటనలపై ,అయన నాయకత్వ శైలి పై , అయన  పాదయాత్రకు ముందు ,మధ్యలో  అడ్డంకులను ,ఆటంకాలను అధిగమిస్తూ సుదీర్ఘ  కాలం  కొనసాగి న  ఆ  చారిత్రాత్మక  పాదయాత్ర  ఒక   జైత్ర యాత్ర గా మారిన విధానం ,ఆయన  ఆలా  ముఖ్యమంత్రి గా  ప్రమాణ స్వీకారం జరిగే వరకు  జరిగిన నిజ జీవిత  సంఘటనలను అల్లుకొంటూ, వరుస  భావోద్వేగాలు పండిస్తూ దర్శకుడు మహి  నడిపించాడు. 

రాజశేఖరుని ధైర్యాన్ని , మొండితనాన్ని ఆత్మ స్థైర్యాన్ని ,నాయకత్వ పటిమను  చాలా చక్కగా చూపించారు. జరిగిన కథ ను   క్రమ  బద్దమైన   కథనం  తో  ఎమోషనల్   డ్రామా  గా మలుస్తూ డైరెక్టర్ తన  సిన్సియర్ ప్రయత్నం తో ఎక్కడా బోరింగ్ మొమెంట్స్ లేకుండా నడిపించాడు. 

వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాల కు కారణభూతం అయినా ప్రజల సమస్యల సంఘటనలను చూపించడం లో దర్శకుడు విజయం సాధించాడు ప్రత్యేకముగా  వైస్సార్  లెక్కేచేయని తత్వాన్ని ,అధిష్టానం పేరుతొ కాంగ్రెస్ నాయకులు వైస్సార్ ను కట్టడి చేయలేక పోయిన సంఘటనల ను చక్కగా చూపించారు ,నిజ జీవిత సంఘటనలో మొదట   సుచరిత గా  

చేవెళ్ల లో  సబితా ఇంద్రారెడ్డి(సుహాసిని ) చేతుల మీదుగా పాద యాత్ర  ప్రారంభమై   ఇఛ్చాపురం లో ముగిసిన 1475 km  యాత్రను  సిన్సియర్ గా ,సెన్సిబుల్ గా క్రమ పద్దతిలో ఎక్కడా పరిధి  దాటకుండా డైరెక్టర్ మహి  తన ప్రతిభను కనబరిచాడు . రాజశేఖరునిగా మమ్ముట్టి   అత్యంతం సమ్మోహనంగా కనబడి ,వైస్సార్ పాత్రకు అయన తప్ప ఇంకెవరు సరిరారనేలాగా నటించాడు . రావు రమేష్  వైస్సార్  ఆత్మ   కేవీపీ  పాత్రలో ఓదిగిపోయాడు.  

మరో పక్క  అద్భుతమైన సిరివెన్నెల గీతాలు , మ్యూజిక్ డైరెక్టర్ కే (కిరణ్ కుమార్) ,SP  బాలు, కాలభైరవ,వందేమాతరం శ్రీనివాస్ , శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడారు  మరియు గాయకుడు పెంచల్‌దాస్ రాసుకొని తనే పాడిన సినిమా లోని చివరి  పాట కంట తడి పెట్టిస్తుంది . 

 సిరివెన్నెల హృదయం నుంచి  వెలువడిన మాటల  మంత్రాలు పాటలై  ఈ సినిమా కి ప్రాణం పోశాయి . 

1) నీ మనసులో  మండు టెండలాగా నిప్పులే చెరగని నిశ్శయం

నీ గుండె లో మంచుటెండలాగ   నిత్యమూ నిలవని నమ్మకం 

వసుధకు  వందనం చేయకుండా  నింగి పైకి ఏగురు తుందా గెలుపుజెండా 

ఆశయం నెత్తురై పొంగ కుండా  శ్వాసలో సమర శంఖం ఆగుతుందా 

2)  మందితో పాటుగా ముందుకే సాగనా! ఎందుకో తోచక ఒంటిగా ఆగనా !

ఏ దరి లేదని   ఈదడం మాననా! ఎంతకీ తీరని ప్రశ్నగా మారనా !"

 వైస్సార్  ప్రజాయాత్ర కు ఉపక్రమించే ముందు యాత్ర చేయడమా? ,మానడమా?,అనుకూలాలు ప్రతికూలాలు  బేరీజు వేసుకొంటూ రాజశేఖరుని మస్తిత్వం లో జరిగే ఆలోచనల అంతర్యుద్ధాన్ని వర్ణిస్తూ ,చివరకి   తనపై  పేద ప్రజలు చూపిస్తున్న  ప్రేమను, నమ్మకాన్ని,విశ్వాసాన్ని  వారి హృదయ స్పందనలకు ప్రతిగా కార్య క్షేత్రం లోకి దిగక తప్పదు అనుకొన్న ఆలోచనల్ని,మనస్సులో  రగిలే భావాలను వర్ణిస్తూ  రాశారు . సాయి చరణ్ పాడిన  ఈ గీతం గొప్పగా ఆకట్టుకొంటుంది. . 

3 ) రైతులు విన్నవించిన  సమస్యలపై  రాజశేఖరుడి  అంతర్మధనం పై 

"పల్లెల్లో కళ ఉంది - పంటల్లో కలిముందిఅని చెప్పే మాటల్లో విలువేముంది ?
కళ్ళల్లో నీరుంది - ఒళ్ళంతా చెమంటుంది .ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది
చినుకివ్వని మబ్బుంది - మొలకివ్వని మన్నుంది...కరుణించని కరువుంది - ఇంకేముంది ?

4) "రాజన్నా నిన్ను ఆపగలరా" !

 రాజశేఖరుని పాద  యాత్రలో ప్రజలు మమేకమై ప్రతి గ్రామంలో  ఆయనకు అపూర్వ స్వాగతం పలుకడాన్ని వర్ణిస్తూ , వారి యాత్రతో  ఉప్పొంగిన ప్రజా స్పందనను తెలియ చేస్తూ,వారి సమస్యలపై  మాట ఇచ్చి తీర్చే మహా నాయకుడు వచ్చాడు అంటూ , ప్రతి పల్లెలో  జనం ఎలా జేజేలు పలికారనే విషయాన్ని సిరివెన్నెల అపూర్వంగా వ్రాయగా , 

 వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం వినసొంపుగా వున్నది .

వూరే ఏరేల్లా మారే ..   హోరు హోరున ఉప్పెంగేరో 

దార్లే  తారంగ మాడి  చేతులెత్తి  జై కొట్టేరో !

మండి పోయే తలపై గొడుగువలె తానొచ్ఛేరో 

మందికోసమే తానున్నానంటూ  మాటిచ్చే మహారాజు నంటూ 

మెతుకుని ఎరుగని బ్రతుకుల మొరవిని 

నీటి మబ్బులా మెరిశాడు  వాన చినుకులా కరిగాడు 

 5)  ఓక మహానాయకుడి కోసం ఎదురుచూసే ప్రజల మనసు లో ని పాటను అద్భుతంగా మలిచారు,శంకర్ మహదేవన్ స్వర పరచిన   

నీరాక కోసం వెతికే చూపులవుతాం !..మా పొద్దు పోడుపా!...  జయహో 

నీ వెంట నిత్యం నడిచే సైన్యం అవుతాం ! మా గెలుపు మలుపా జయహో !

ఎవరూ లేరని ఎవరు రారని తపిస్తున్న మా  కలలాగా

తానే పంపని నువ్వున్నావని   సత్యం నమ్మని 

6) "మరుగైనావా రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా !

పాటల రచయిత, గాయకుడు పెంచల్‌దాస్ రాసిన చివరి పాట ప్రేక్షకుల గుండెల్ని పిండేసి కళ్ల నీళ్లు తెప్పిస్తుంది. రచయిత తనకు దివంగత నేత పై ఉన్న అభిమానాన్ని ,ఆయన అభిమానులు రాజశేఖరుని మరణ వార్త విన్న తరువాత వారి తీవ్ర దుఃఖాన్ని ,మనో వేదన ను పాటగా   పాడి ప్రేక్షకుల చే  చివర్లో కంట తడి పుట్టించాడు.  

మొత్తానికి ఈ సినిమా వైస్సార్  జేత్రయాత్ర ను వెండితెర మీద ఘనంగా ఆవిష్కరించింది . 

 

Latest News
Political News
Entertainment
PHOTO GALLERY

Photo Comment
Spiritual