Khichdi News
త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి !
త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి !

ఇక్షాకు వంశ రాజు ల్లో త్రిశంకువు ఒకడు . అతడు సత్యవాది ,జితేంద్రియుడు ,అయినా కూడా  బొంది తోనే స్వర్గం చేరాలని అయన తపన ,తన కోరికను కుల పురోహితుడైన వశిష్ఠుడితో చెప్పాడు . అది అతను అసాధ్యం అన్నాడు . వశిష్టుని వందమంది కుమారులు కూడా అది అసాధ్యమని తేల్చేచారు . తరువాత త్రిశంకువు విశ్వామిత్రుడ్ని ప్రార్ధించాడు . అతని పై జాలి పడి వశిష్టుడు చేయలేని పని తానే చేయగల నని   విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.

దీనికై త్రిశంకువు తో పెద్ద యజ్ఞం చేయించాడు . అయితే ఆ యజ్ఞ హవిస్సును తీసుకోవడానికి ఎవరూ దేవతలు రాలేదు . విశ్వామిత్రునికి కోపం వచ్చింది . "త్రిశంకూ నా తపస్సు శక్తీ ని దారపోస్తున్నాను ,ఇక నీవు బొంది తో స్వర్గం చేరుకో అని అన్నాడు . అయన వాక్కు ఫలితం త్రిశంకుడు స్వర్గం నేరుగా చేరుకొన్నాడు . అక్కడ ఇంద్రుడు త్రిశంకుడు స్వర్గం లో నికి అనుమతించకుండా క్రిందకు తోసి వేశాడు. వెంటనే విశ్వామిత్రుడు త్రిశంకు అక్కడే ఆగిపో అని ఆదేశించి దక్షిణం వైపు నిలబెట్టాడు . అక్కడ సృష్టి కి పునఃసృష్టి చేసి సప్తర్షులను,నక్షత్రాలను  సృష్టించి ,రెండో ఇంద్రుడ్ని ,దేవతలను కూడా సృష్టించడానికి సిద్దపడుతూ వుంటే దేవతలు భయభ్రాంతులై విశ్వామిత్రుడితో రాజి కి వచ్చారు .త్రిశంకును ,విశ్వామిత్ర సృష్టిని అంతటిని జ్యోతిర్మండలం వెలుపల నుంచారు .త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.దానినే త్రిశంకు స్వర్గం అంటారు

నీతి :

ఎవరైనా సరే సృష్టి ధర్మానికి  అతీతంగా అసాధ్యమైన పనులకు పూనుకోకూడదు ,త్రిశంకునిలా అత్యాశలు పెట్టుకోకూడదని చెపుతారు .   

పాపం త్రిశంకుడు స్వర్గం లోకి వేళ్ళ లేక భూమి మీదకు వెళ్లలేక మధ్యలో వుండి పోయాడు 

సేకరణ  :  చిత్రకవి ఆత్రేయ గారి 'ధర్మ సందేహం' అనే పుస్తకం నుంచి 

 

  

Nov 03 2016 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual