Khichdi News
బాక్స్ఆఫీసు రికార్డులతో BOSS ఖుషి!
బాక్స్ఆఫీసు రికార్డులతో BOSS ఖుషి!

పుత్రోత్సహం లో  ఖుషి ఖుషీగా చిరంజీవి !

కొడుకు ప్రయోజకుడు అయితే తండ్రికి అప్పుడే  ఆనందం కలుగుతుంది అంటారు ,అలాగే కొడుకు తండ్రి గౌరవాన్ని తిరిగి నిలబెడితే అప్పుడు అపరిమిత పరమానందం కలుగుతుంది అదే  మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అనుభవిస్తున్నారు . కొడుకు నిర్మించిన  ఖైదీ ఘనవిజయం తో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ వున్నారు . ఇక చిరంజీవి గారి  గత 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణం,జీవిత ప్రయాణం  తీరు తెన్నులు చూద్దాం !

ప్రజారాజ్యం  వైఫల్యం! ......... 'మగధీర "ఘన విజయం

2008 లో ప్రజారాజ్యం పెట్టి   ఎన్నో  అవమానాలు ఎదుర్కొని  2009 ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితమై  గెలిచిన ఆ  ఎమ్మెల్యే లు కూడా తలోదిక్కూ  కాంగ్రెస్ లోకి  వెళ్లే ప్రయత్నం లో వున్నప్పుడు ,  చిరంజీవి  రాజకీయ వైఫల్యం తో ఎంతో నిరాశలో వున్నప్పుడు  తన  కొడుకు రామ్ చరణ్  'మగధీర ' సినిమా ద్వారా  ఘన విజయం సాధించి మొదటి సారి చిరంజీవి మొహం లో సంతోషాన్ని కలిగించాడు . అప్పుడు ఎమ్మెల్యే లు అందరికి టిక్కెట్లు అసెంబ్లీ లాబీ ల్లో  పంచి పెట్టడం తెలిసిందే ,చిరంజీవి మగధీర సినిమా ను ఎంతో మంది ప్రముఖులకు సంతోషం తో చూపించిన విషయం మనకు తెలుసు . ఆ సమయం లో చిరంజీవి కి  ప్రజారాజ్యం ఫెయిల్యూర్ బాధ నుంచి మగధీర విజయం కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పాలి .

కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం విలీనం !

ఇంతలో వైస్ రాజశేఖర రెడ్డి మరణం,జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రతో కకావికలమైన కాంగ్రెస్ పార్టీ కి చేదోడుగా  ప్రజారాజ్యం  వ్యవహరించి  ,చివరికి రాజకీయ ఉనికి కోసం ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేయడం అందరిని భాదించిందనే చెప్పాలి . తరువాత  చిరంజీవి కేంద్ర మంత్రి అయినా కూడా ప్రజలు ఈసడించుకోవడం ,తిరుపతి లో స్వంత నియోజకవర్గం లో ప్రజల ఆగ్రహానికి చిరంజీవి గురి అవ్వాల్చి వచ్చింది . 

పవన్ కళ్యాణ్ ప్రభంజనం 

క్రమేపి  పవన్ కళ్యాణ్  అన్నకి దూరం అవడం ,అనుకోకుండా పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ అద్భుత విజయాన్ని స్వంతం చేసుకోవడం తో ,చిరంజీవి పై అసంతృప్తి తో వున్న అభిమానులు ఒక్కసారిగా పవన్ అభిమానులుగా రూపాంతరం చెందారు . ఇంతలో తెలంగాణ విభజన జరగడం ,పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి  నాయకుడు   కెసిఆర్ పై విరుసుకు పడడంతో ఒక్కసారిగా అనేకుల అభిమానిగా ఎక్కడలేని మద్దత్తు  కూడా గట్టుకొన్నాడు . 

ఇంతలో పవన్ కళ్యాణ్ కొత్త కుంపటి ,వేరు కుంపటి జనసేన పెట్టి  గత ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పక్షం చేరడం ,చిరంజీవి అభిమానులందరూ పవన్ అభిమానులుగా పరివర్తన చెందడం ,చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం ను కలపడం ఇష్టం లేని వారంతా పవన్ కు జై కొట్టి తెలుగుదేశం బీజేపీ లను గెలిపించారు . 

మెగా స్టార్ ని చికాకు పెట్టిన పవన్ కళ్యాణ్  ఫాన్స్  అరుపులు రచ్చలు ! 

చిరంజీవి పై అసంతృప్తి తో వున్న అభిమానులు తరువాత మెగా ఫామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా  పవర్ స్టార్ అంటూ అరుస్తూ ప్రతి ఆడియో రిలీజ్ లేదా ప్రీ రిలీజ్ ప్రోగ్రాం ల్లో అభిమానుల రసాభాస  చేయడం  మొదట్లో సహజంగా వున్నా కూడా రాను రాను వారి తీవ్రత చిరంజీవికి  ఎంతో బాదేసిన కూడా భరించాల్చి వచ్ఛేది ...మెగాస్టార్ బర్త్ డే ప్రోగ్రాం లో కూడా అభిమానుల రసాభాస చూసి  ఒకసారి నాగబాబు తట్టుకోలేక అభిమానులను అరిసి తరువాత వచ్చిన  బ్రూస్ లీ సినిమాపై ఆ ఎఫెక్ట్ పడి ఆ సినిమాను పవన్ అభిమానులు బాయికాట్ చేయడం తో  సినిమా ప్లాప్ మూట కట్టుకొని  బంగ పడ్డది తెలిసిందే  . 

ఒక ఆడియో ఫంక్షన్ లో చివరికి చిరంజీవి ని కూడా మాట్లాడనివ్వని పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై అల్లు అర్జున్ ఫైర్ అయితే చివరికి ఆయనకు కూడా 

ఇదే అనుభవం ఎదురై ఆయనను సోషల్ మీడియా లో పవన్ అభిమానులు ఒక రేంజ్ లో విమర్చించడం మనం చూశాము .

రాంచరణ్ ప్రొడ్యూసర్ గా అవతారం !

తన తండ్రి లో ఏర్పడిన  అసంతృప్తి ని,మానసిక ఒత్తిడి,ఆత్మన్యూనతను  గ్రహించిన రాంచరణ్ మెగాస్టార్ ను మళ్ళి ట్రాక్ లో పెట్టి  ఆయనను సంతోష పెట్టాలి అంటే ఆయన 30 సంవత్సరాలు వెలుగు  వెలిగిన వెండి తెరకు మళ్ళి ఆయనను తీసుకురావడం అని గ్రహించి తండ్రిని సినిమా కి  ఓప్పించి ఎవరైనా ప్రొడ్యూసర్ అయితే మూవీ నిర్మాణ ఖర్చు లో వెనుకాడవచ్చూ నెమో నని తానే ప్రొడ్యూసర్ గా  మారి తండ్రికి ఇష్టమైన  వి వి వినాయక్ తో చిరంజీవి 150 వ సినిమా "ఖైదీ నెంబర్ 150"  ప్రారంభించాడు ,తన సినిమాలు పక్కన పెట్టి మంచి కథల కోసం తీవ్రంగా కస్టపడి సరిగ్గా తమిళం లో హిట్ అయినా 'కత్తి' సినిమా కథను ఎన్నుకున్నాడు . సినిమా మొత్తం పర్యవేక్షించి , తనే స్వంతంగా  మంచి రిలీజ్ ప్లాన్ చేసి అద్భుతంగా రిలీజ్ చేసి ఎవ్వరూ ఊహించని 120 కోట్ల  రికార్డు కలెక్షన్ల తో ఘన విజయాన్ని స్వంతం చేసుకొన్నాడు ,చెల్లా చెదురైనా చిరంజీవి అభిమానులను ఒక గూటి కి మళ్ళి చేర్చాడు . 

పుత్రోత్సహం లో  ఖుషి ఖుషీగా చిరంజీవి !

కొడుకు నిర్మాతగా సాధించిన విజయం,తనని మళ్లి వెండితెరకు అద్భుతంగా లాంచ్ చేసిన రాంచరణ్  ని చూసి చిరంజీవి ప్రుత్రోత్సాహం తో ఉక్కిరి బిక్కిరి అయ్యి మరలా తన అభిమానుల్ని తన గూటికి రప్పించుకొని తిరిగి చలన చిత్ర రంగంలో తన స్థానం  మళ్ళి పదిలం చేసుకున్నందుకు    దీనికి తన కుమారుడు కారణం అయినందుకు మహదానందం తో చిరంజీవి ఇప్పుడు అన్ని ఆడియో ఫంక్షన్ లకు గెస్ట్ గా వెలుతున్నారు . తండ్రి కళ్ళలో ఆనందాన్ని చూసి చరణ్ మరింత కాన్ఫిడెన్స్ గా తనపని చేసుకొని వెళుతున్నాడు . 

 

Jan 29 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual