Khichdi News
ఉరవకొండ లో బాబు పై చేలరేగిన జగన్!
ఉరవకొండ లో బాబు పై చేలరేగిన జగన్!

అనంతపురం జిల్లా రైతులకు అండగా నిలుస్తూ, ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ సోమవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించింది . ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ధర్నాలో పాల్గొని ముఖ్యమంత్రి  చంద్ర బాబు గారి ప్రజా వ్యతిరేక విధానాలపై విరుసుకు పడ్డాడు , ఒకప్పుడు వెంకయ్య నాయుడు ,నల్లపురెడీ శ్రీనివాసుల రెడ్డి లాగా  అనర్గ ప్రసంగ  శైలీని  మెల్ల మెల్లగా అలవరుచు కొంటున్నారు .తన స్వభావానికి విరుద్ధంగా రకరకాల ప్రాసలతో చంద్ర బాబు పై విమర్శల జడివాన కురిపించారు . 

ఎన్‌.టి.ఆర్‌.తో్ కయ్యం! ...బాలకృష్ణ తో వియ్యం చేస్తాడు 

కాంట్రాకర్ ల‌తో స్నేహం చేస్తాడు!...రైతులతో యుద్ధం చేస్తాడు!!

అందితే కె.సి.ఆర్‌. జుట్టు ప‌ట్టుకుంటాడు!... దొరికిపోతే అదే కె.సి.ఆర్‌. కాళ్ళు ప‌ట్టుకుంటాడు!!

మోడీ బలహీనంగా ఉన్న‌ప్పుడు మోడీతో ఢీ అంటాడు!
మోడీ బలంగా ఉన్న‌ప్పుడు మోడి కాళ్ళు పట్టుకుంటాడు... రాష్ట్రాన్ని తాక‌ట్టు పెడ‌తాడు!!

కోతలు చూస్తే కొండంత ...చేతలు చూస్తే చీమంత

పార్టీ పేరు తెలుగుదేశం...  నిద్దరలేస్తే విదేశాల్లో ఉంటాడు, దావోస్, సింగపూర్, మలేసియా, లండన్ ను

ఆంధ్ర ప్రదేశ్ కి తీసుకొస్తా అంటాడు !! చివరికి కజకిస్తాన్ ,శ్రీలంక తో అమరావతి అంటాడు . 

అవినీతి మీద యుద్ధం పోరాటం అని సూక్తులు చెప్పుతాడు చేసేదేమో గుడిభూములు కూడా వదలకుండా అవినీతి...

 ఇలాంటోడ్ని ముఖ్యమంత్రి అంటారా, ముఖ్యకంత్రీ అంటారా?

మోసం, కుతంత్రం, అవినీతి, దురాశ, దుర్మార్గం, ప్రలోభం, అత్యాశ ఇవన్నీ ఆయన గుణాలు... కానీ నిరంతరం నాకంటే మంచోడు లేడంటాడు...
రాయలసీమ పర్యటన లో రాజకీయాలు గుర్తొస్తాయి !!

పట్టిసీమ తో 45 టిఎంసిలు రాయలసీమకు నీళ్లు అంటాడు... శ్రీశైలం నుండి నీళ్లు తీస్కోండి అని జీవో ఇవ్వడు!!
కోస్తాలో మాత్రం పట్టిసీమతో డెల్టాను కాపాడాను అంటాడు !!

నమ్మేవాళ్ళుంటే చంద్రబాబు శ్రీకాకుళం కి హంద్రీనీవా ద్వారా నీళ్లిస్తా అంటాడు
గాలేరుద్వారా ఆఫ్రికాకి... అక్కడినుండి అమెరికాకి నీళ్లిస్తా అంటాడు

మామను వెన్నుపోటు పొడుస్తాడు ఎన్నికలప్పుడు పూలదండ వేస్తాడు !!

అయన కు విగ్రహాలు పెట్టేవాళ్ళేవారు ఉండరని తన విగ్రహానికి తానే పూలదండ వేసుకుంటాడు... మొన్న విశాఖలో జ‌రిగిన‌ సమ్మిట్లో లాగా!!

వైయస్సాఆర్ పాలసీ ప్రజలకు మంచి చేయడం  ఈయన పాలసీ మంచి చేయకుండా ప్రచారం చేస్కోవడం

ఇద్దర్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు...ప్రాణాలు బాగుండి సంతోషంగా ఉంటె వైయస్సాఆర్ గుర్తొస్తారు!
మోసం దగా ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు గుర్తు వస్తాడు!!

సాయంకాలం నా మీటింగ్ అయిన ప్రతి సారి  5గంటలకు కి 5/6 మంది మంత్రులు టివిల ముందుకొచ్చి జగన్ అట్లా ఇట్లా... వాళ్ళ నాయన ఇట్లా... వాళ్ళ తాత ఇట్లా అంటారు.  అయ్యా ఇవన్నీ విని విని సాలయ్యింది, ప్రాజెక్ట్ లు కట్టేది రైతులకోసం.. ప్రజలకోసం.. కాంట్రాక్టర్ ల కోసం కాదు..
మంత్రులు నన్ను తిట్టడానికి కాదు ప్రజలకుసమాధానం చెప్పేదానికి మీడియా ముందుకు రండి !!

చివరిగా ఒక్కటి చెపుతా  మా ప్రభుత్వం అధికారం లోకి వస్తే 2 ఏళ్లలో హంద్రీనీవా పూర్తి చేసి మీకిస్తా !!

 

Feb 06 2017 | Chanakya
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual