Khichdi News
జేసీ ప్రభాకర్ రెడ్డికి నీళ్లు ఇవ్వని ఊరు
జేసీ ప్రభాకర్ రెడ్డికి నీళ్లు ఇవ్వని ఊరు

జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి తిమ్మం పల్లిలో ఇల్లు కొని గృహప్రవేశం చేసిన రోజు ఆవూరు మొత్తం అయన చేరికకు నిరసనగా అంగళ్ళు కూడా బందు చేసి మంచి నీళ్లు కూడా దొరకనీయకుండా చేశారు. వై ఎస్ అర్ సి పి నాయకుడు కెతిరెడ్డి పెద్దా రెడ్డి రెండు నెలల క్రితం తాడిపత్రి ఇంచార్జి అయి జేసీ దివాకర్ రెడ్డి పై నిప్పులు చెరుగుతూ జేసీ బ్రదర్స్ అడ్డా అయిన తాడిపత్రిలో ఇల్లు కొని జేసీ సోదరుల ఆగడాలను అడ్డుకొంటా అని ప్రకటించిన నెలకు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్దారెడ్డి స్వంత వూరులో ఇల్లు కొని నిన్న అక్కడకి గృహ ప్రవేశం చేస్తే ఆ వూరి నుంచి ఒక్క మనిషి కూడా అయన ఇంటికి రాకపోగా, చివరికి షాపులు బందు చేసి జేసీకి నీళ్లు కూడా దొరకకుండా చేశారు. తాడి పత్రీలో ఇల్లు కొన్న పెద్దారెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభిస్తే తిమ్మపల్లిలో ఇల్లు కొన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తుల తిరస్కరం ఎదురయింది. 

జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య దాదాపు 4 దశాబ్దాల రాజకీయ కక్షలు, పగలు వున్నవి. వైస్సార్ ముఖ్యమంత్రి అయినా తరువాత వీరి మధ్య రాజి చేసినా కూడా అది కొంత కాలం  మాత్రమే  నడిచింది. ఇంతలో జేసీ సోదరుల వర్గీయులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డిని దుర్మార్గంగా హత్య చేయడంతో మళ్ళి మొదటికి వచ్చాయి. 

వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి జేసీ సోదరులతో పాటు వారి కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిని కూడా బరిలో దింపాలని భావిస్తున్నారు. అదే జరిగితే జేసీ కుటుంబానికి మూడు నాలుగు సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అని  జిల్లా మొత్తం జేసీ ఆక్రమిస్తాడని భయంతో అపుడే తెలుగుదేశం నాయకుల్లో లుక లుకలు ప్రారంభమయ్యాయి అందుకే పెద్దారెడ్డికి లోపాయిగా మద్దత్తు ఇస్తూ ఉండడంతో బలమైన నేతగా ఎదుగుతున్నాడు. 

తాడిపత్రిలో ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే జేసీ సోదరుల ఆగడాలు వారికీ ప్రత్యర్థిగా పెద్దారెడ్డి ముందుకు రావడంతో ఫ్యాక్షన్ మళ్ళి మొదలవుతుందేమోనని నియోజక ప్రజలు భయపడుతున్నారు.

 

 

 

 

Feb 08 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual