Khichdi News
పేరెంట్స్ వొద్దా? ఐతే జీ(వి)తం కట్?
పేరెంట్స్ వొద్దా? ఐతే జీ(వి)తం కట్?

'భర్త మాత్రమే కావాలి..వయో వృద్ధులైన భర్త తల్లి తండ్రులు భారం', 'భార్య మాత్రమే కావాలి..భార్య తల్లి తండ్రులు వద్దు', అనే వారికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచింది అస్సాం సర్కార్! లేదు లేదంటే కుదరదని తేల్చి చెప్పింది!

పెళ్లితో హోదా వస్తే తల్లిదండ్రుల్ను కూడా అంగీకరించాల్చిందే. వారి భాద్యతను స్వీకరించాల్చిందే!

వయసు పైబడిన తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్ని కట్ చేయాలన్న ప్రతిపాదనను అసోం ప్రభుత్వం తాజాగా చేపట్టింది.

తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసోం ఆర్థికమంత్రి హిమంత బిశ్వా సర్మా ఈ సంచలన ప్రకటన చేశారు. వయసు మీద పడిన పేరెంట్స్కు బాసటగా నిలిచిన అసోం సర్కారు నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల బాగోగులు చూడాలని, లేనిపక్షంలోవారి బాగోగుల్ని ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందుకు కాను ఎంత మొత్తమైతే ఖర్చు అవుతుందో దాన్ని ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి కట్ చేయనున్నట్లుగా ప్రకటించింది. తాజా నిర్ణయం పుణ్యమా అని తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటుందన్న ఆశాభావాన్నిఅసోం సర్కారు వ్యక్తం చేస్తోంది.

'జీవితం' యిచ్చిన తల్లిదండ్రులకోసం కాకపోయినా కనీసం 'జీతం' కోసమైనా కొంతమంది మారతరేమో చూడాలి!! 
తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలూ! చచ్చాక ఫోటో ముందు నిలబడి దొంగ ఏడుపులు ఏడ్చేబదులు..వాళ్ళు బ్రతికున్నపుడు కనీసం వొక ఫోన్ కాల్ చెయ్యండి!
'బాగున్నారా?', అని అడగకపోయినా..కనీసం 'బ్రతికున్నారా?', అనైనా అడగండి! ఉద్యోగాలు పోతే మల్లి తెచ్చుకోవచ్చు..అమ్మ-నాన్న పోతే? తిరిగి తెచ్చుకోలేము..ఎంత ఏడ్చినా!

తల్లిదండ్రులు పిల్లలకోసం చేసే త్యాగాలను గుర్తుచేసే ప్రయత్నంలో కొన్ని వీడియోలు.. 

https://www.youtube.com/watch?v=3bdm4NBYxII

https://www.youtube.com/watch?v=ZdLVnY4cLxA

https://www.youtube.com/watch?v=YeCSlhNM1ZM

https://www.youtube.com/watch?v=1BZmuz88KEY

Souce Credits: Suryaprakash Josyula

Feb 09 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual