Khichdi News
హార్వార్డ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం !
హార్వార్డ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం !

హార్వార్డ్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం ! 

యూనివర్సిటీ లో ప్రతి సంవత్సరం నిర్వహించే India conference 2017  రెండు రోజుల సదస్సులో పవన్ కళ్యాణ్ అతిధిగా ప్రధాన వక్త గా పాల్గొన్నారు . రెండు సభల్లో  కూడా పవన్ కళ్యాణ్ సభలోకి రాగానే అభిమానుల సభ దద్దరిల్లేలా చప్పట్లు కొడుతూ  అరుపుల తో స్వాగతం పలికారు .గత సంవత్సరం కమల్ హాసన్ ఈ సమావేశాలకు హాజరు అవగా ఈసారి పవన్ కళ్యాణ్ మరియు మాధవన్ ,వివేక్ ఒబెరాయ్ లు హాజరు అయ్యారు 

మొదటి రోజు ! 

మొదటి రోజు తన బాల్యం ,యవ్వనం రోజుల్లోని విషయాలు సభికులతో పంచుకొన్నారు .వరుసగా పరీక్షల్లో ఫెయిల్  అవుతూ ఉంటే ఏమి చెయ్యాలో తెలియక సరి అయినా లక్ష్యం పై ద్రుష్టి లేక  ఆత్మ హత్య చేసుకొందామనుకొన్నాను . మా అన్నయ్య  కున్న  licensed  గన్ తో నన్ను నేను కాల్చు కోవాలనుకొన్నాను .ఇంటర్ తరువాత సమాజం గురించి ఆలోచిస్తూ  తీవ్ర డిప్రెషన్ గురయ్యాను  అయితే యోగ , ధ్యానం వల్ల కొంచెం మారి ,మా అన్నయ్య సూచనల తో సినిమా యాక్టింగ్ పై ఫోకస్ అవడం తో ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడ్డాను  అని తెలిపారు . అడ్డగోలుగా చేసిన రాష్ట్ర విభజన తనను బాధించిందని ,అప్పటి నుంచి రాజకీయాల్లో కి మరలా వచ్చి జనసేన ను స్థాపించానని తెలిపారు .మొదటి నుంచి సామాజిక సమస్యల పై ఎక్కువ ఆలోచించడం వల్ల సినిమా రంగం లో కూడా సంతృప్తిగా పని చేయలేకపోయానని తెలిపారు . 

రెండవరోజు !

రెండవరోజు ప్రసంగం లో  భారత దేశం లో రైతుల సమస్యలు ,మంచి నీళ్ల సమస్యలు గురించి ప్రస్తావించారు . స్కూల్స్ ,కాలేజీ లలో ప్లే గ్రౌండ్ లేకపోవడం తో విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నారని బాధ పడ్డారు ,నోట్ల రద్దు వల్ల  సామాన్యప్రజలు ATM ల వద్ద రోజుల త్వరపడి  ఇబ్బంది పడ్డారు కానీ సంపన్నులు  ఏమాత్రం కలవరపడలేదని demonetization వాళ్ళ దేశ తలసరి ఆదాయం పడిపోయిందని  అన్నారు . ఉత్తర దక్షిణ ప్రాంతాలలో రాజకీయ ,సంస్కృతీల పరంగా ఎంతో తేడాలున్నాయని ,అన్ని ప్రాంతాలను సమదృష్టి తో చూడాలని అన్నారు .తరువాత విద్యార్థులు ,అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చ్చారు . జనసేన పార్టీ అట్టడుగు వర్గాల ఉన్నతి కి పాటు పడేలా తీర్చి దిద్దుతామని తెలిపారు . ప్రవాసులు తమ విలువైన సలహాలను జనసేన కు సూచించాలని కోరారు . 

అమెరికా లో వివిధ ప్రాంతాల నుంచి  తెలుగు వారు బోస్టన్ లోని   హార్వార్డ్  యూనివర్సిటీ లో పవన్ సభకు హాజరు అయినారు .పవన్  రాకతో తెలుగు వారు టిక్కెట్లన్నీ కొనడంతో అన్ని సీట్లు ఫుల్ అయిపోయాయి . యూనివర్సిటీ లో ఈవెంట్ నిర్వహించేవాళ్ళు తప్పా  సమావేశం హాలు మొత్తం అభిమానులతో నిండి పోయినది .మొత్తానికి అమెరికాలో పైగా ఎంతో చరిత్ర కలిగిన హార్వార్డ్ లో కూడా అభిమానుల  జిందాబాద్  అరుపులు చూసి వున్న సమావేశం లో వున్నా ఆ కొద్దీ మంది  విదేశీయులు  ఇబ్బంది పడ్డారు  .  ప్రసంగం మధ్యలో  కొందరు అదే పనిగా అరుస్తూ వుంటే పవన్ కళ్యాణ్ కూడా టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యారు ,వినబడక చాల ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పలేక పోయారు . ఆడియో ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం తో పవన్ స్పీచ్ స్పష్టంగా వినబడలేదు .

పవన్ ప్రసంగంలో  గతం లో ఎన్నో  బహిరంగ సభల్లో తను పేర్కొన్న  పలు పాత  విషయాలే వుండడం ఆశర్య పరిచింది.అమెరికా లో భారతమాతకి జై అన్నప్పుడు చివరగా  అమెరికాకు  కూడా  కృతజ్ఞతలు  చెప్పి వుంటే  బాగుండేది . 

పవన్ కళ్యాణ్ లైవ్ స్పీచ్ కవర్ చేసే University నెట్ వర్క్ లు విపరీతమైన ట్రాఫిక్  వల్ల పలుమార్లు  షట్ డౌన్ అయిపోయాయి.

ప్రవాస కాపు సంఘం ఆద్వర్యం లో  పవన్  రాక సందర్భముగా  300 కార్లతో ర్యాలీ తీశారు ,అడుగడుగునా ఉత్తర అమెరికన్ ప్రోగ్రెసివ్  కాపు సంఘం ఆధ్వర్యంలో  పవన్ కు ఘనస్వాగతాలు ఏర్పాటు చేశారు.కాలేజీ విద్యార్థులు ,పవన్ అభిమానుల కోలాహలం తో పవన్  అమెరికా ట్రిప్ ముగిసింది .

Feb 12 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual