Khichdi News
గల్లా కుటుంబం వైసీపీ కి దగ్గరగా !
గల్లా కుటుంబం వైసీపీ కి దగ్గరగా !

ముఖ్యమంత్రి చంద్రబాబు,తనయుడు లోకేష్  పై అసంతృప్తితో వున్న పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ క్రమేపి వైస్ జగన్ మోహన్ రెడ్డి కి దగ్గర అవుతున్నారు . కాంగ్రెస్ లో వున్నప్పుడు వై ఎస్ ప్రభుత్వ హయాం లో చక్రం తిప్పిన గల్లా అరుణకుమారి కూడా తెలుగు దేశం లో తమకు సరియైన గుర్తింపు లేదని భావిస్తున్నారు .  వైస్సార్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తో,ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావులతో  తనకు వున్న ప్రత్యేక అనుభందం దృష్ట్యా  వారి బంధువైన గల్లా అరుణకుమారి కి(కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ అయ్యి గతంలో కోట్ల వర్గంలో ఉన్నపటికీ )  ప్రముఖంగా  ప్రాతినిధ్యం ఇచ్ఛేవాడు .2009 ఎన్నికల్లో రోజా టీడీపీ తరపున చంద్రగిరి లో నిలబడ్డప్పుడు ఆమెను ఓడించి గల్లా అరుణకుమారి ని గెలిపించడానికి జగన్ కూడా అన్ని శక్తులు ఉపయోగించి  తీవ్రంగా కృషి చేశాడన్నది తెలిసిందే . అప్పట్లో గల్లా గెలుపు కోసం జగన్ అనుచరుడు,ఇప్పటి ఎమ్మెల్యే   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి   జైలు కు కూడా వెళ్లిన విషయం విదితమే . 

గత ఎన్నికల్లో గల్లా వర్గం తెలుగుదేశం లో చేరినా కూడా ఆదిశేషగిరి రావు జగన్ తోనే వుండి పోయాడు .జగన్ అంటే తమకు ఎంతో ఇష్టమని సూపర్ కృష్ణ పలుమార్లు చెప్పిన విషయం విదితమే . ఈమధ్యనే కృష్ణ సోదరుడు అమరావతి లో తన స్వంత భూమిని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం విరాళంగా అందచేశారు . గత కొంతకాలంగా అయన  ప్రతి మీటిగులోను జగన్ మోహన్ రెడ్డి వెంటనే వున్నారు

సూపర్ స్టార్  మహేష్ కు తన బావ  జయదేవ్ (గల్లా అరుణకుమారి తనయుడు) అంటే అమిత ఇష్టం,తన సోదరి భర్త గానే కాకుండా ఒక మిత్రుడు గా కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్త్తుంటాడు . అయితే తెలుగు దేశం ఎంపీ అయుండి  ఇంగ్లీష్ భాషలో పట్టు కలిగి  పార్లమెంటు లో జయదేవ్ దూకుడుగా ఉండడం సీనియర్  తెలుగు దేశం నాయకులకు మింగుడు పడడం లేదు అందుకే అయన మీద పితూరీలు చంద్ర  బాబు కు  అందచేయడం వాటిని యధావిధిగా  అయన నమ్మడం విశేషం.దానితో పార్టీలో  జయదేవ్ క్రియాశీలక పాత్ర ను క్రమంగా తగ్గించేశారు .

గల్లా కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి కి విభేదాలు రావడానికి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి  ఒక కారణం ,తను చంద్రగిరి లో ఎమ్మెల్యే అవడానికి ఓదార్పు  యాత్ర ,వైస్ విగ్రహాల విషయం లో కావాలనే  గల్లా కుంటుంబం పై ఒంటెద్దు పోకడ అవలంభించి అతి చేసి వారిని రోడ్డు మీదకు ఈడ్చాడని,గల్లా కుటుంబానికి జగన్ మీద కలిగిన వ్యతిరేకత కు కారణం చెవిరెడ్డి  చేష్టలను  ప్రోత్సహించడమే అని నియోజక వర్గంలో గల్లా వర్గీయులు  అనుకొంటూ వుంటారు.  అయితే ఇలా గల్లా కుంటుంభంపై  పోరాటం  చేయగలగడం వల్లనే భాస్కర్ రెడ్డి చంద్రగిరి కి ఎం ఎల్ ఏ అవగలిగాడని ఆయన మిత్రులు అంటుంటారు . 

అయితే గల్లా కుటుంబానికి చంద్రబాబు గారి పై వున్న అసంతృప్తిని ఆసరా చేసుకొని ఆదిశేషగిరి రావు జగన్ కు మరియు గల్లా కుటుంబానికి మధ్య సయోధ్య కుదిర్చే పని ప్రారంభించాడు . దీనిలో భాగం గా  జయదేవ్ కు చంద్రగిరి ఎం ఎల్ ఏ సీటు ఇచ్ఛేలా చేసి భాస్కర్ రెడ్డి ని తిరుపతి కి పంపడమో లేదా ఎమ్మెల్సీ ఇవ్వడమో చెయ్యాలని చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ప్రత్యేక పరిస్థితులు వున్న చంద్రగిరి లో చెవిరెడ్డి  మళ్ళి పోటీ చేసి గెలవడం ఈ సారి కష్టం అని వైసీపీ లో ప్రముఖ వర్గం భావిస్తున్నది .  

వైసీపీ సీనియర్ నాయకుడు  భూమా కరుణాకర్ రెడ్డి ని రాబోయే ఎన్నికల్లో రాజ్యసభకు కి ఎంపిక చేసి అయన సర్వీసులను పార్టీ లో ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది .జగన్ మోహన్ రెడ్డి  ఈసారి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వారిని ఆకర్చించే పనులు ప్రారంభించినట్లు తెలుస్తున్నది .  

Feb 25 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual