Khichdi News
దారుణకాండ కు సమాధానం చెప్పండి - సునయన
దారుణకాండ కు సమాధానం చెప్పండి - సునయన

నాకు జరిగిన  అన్యాయంకు సమాధానం  చెప్పండి - సునయన 

కాన్సాస్ లో జరిగిన జాత్య అహంకార దాడుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతి  పై అయన శ్రీమతి అమెరికా ప్రభుత్వం పై  ప్రశ్నలు కురిపించారు.మేము అమెరికాకు ఉద్యోగం కోసం వచ్చి మీ దేశం కోసం మేము పనిచేస్తూ ఉంటే మమ్మల్ని చంపుతారా అంటూ ధైర్యం గా  మీడియా సాక్షిగా నిలదీసింది .అమెరికన్ డ్రీం అంటే ఇదేనా అని ప్రశ్నించింది . ఎన్నో ఆశలతో అమెరికా కు వచ్చాము , వీసా పాలసీలలోమార్పులు వచ్చిన తరువాత అక్కడక్కడా షూటింగ్ లు జరుగుతున్నాయని ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాదని నేను తనతో   భారత్ కు వెళ్ళాలి అనుకొన్నా కూడా శ్రీనివాస్ మనకేమి కాదు అనే వాడు .అమెరికా ను,దాని స్వాతంత్య్రాన్ని అమితంగా అభిమానించేశ్రీనివాస్ కు ఇలా అవడం దిగ్బంతికరం 

బార్ లో మిత్రుని తో పాటు సరదాగా బీరు తాగుతున్న శ్రీనివాస్ దగ్గరకు వచ్చి మీ దగ్గర వీసాలు వున్నాయా అని అడుగుతూ మీరు ఈ దేశం నుంచి వెళ్లి పోండి అంటూ బెదిరించడం తో బార్ స్టాఫ్ వచ్చ్చి అతన్ని బయటకు పంపారని ,శ్రీనివాస్ తానేమి మాట్లాడలేదు ,ఏ తప్పు చేయలేదని అక్కడే కొద్దీ సేపు కూర్చొని వుండడం తో ఆ దుండగుడు తిరిగి వచ్చి తన భర్త పై  కాల్పులు జరిపాడని కన్నీళ్లు పెట్టుకొన్నారు . 

ఎంతో సున్నితమైన మనస్కుడైన నా భర్త ను విదేశీలైన ముస్లిం మతం  కు చెందిన వాడని భావించి కాల్పులు జరిపాడని ఆ దుండగుడు కాల్పులు జరిపిన తరువాత గర్వంగా  వేరే బార్ లో వెళ్లి చెప్పాడని.అమెరికా దేశమే అన్ని దేశాలు ఇక్కడకు వచ్చి ఏర్పాటు చేసుకొన్న విదేశీ వలసల  దేశం అని ప్రజలకు ,అమెరికా పాలకులకు తెలియదా అని ప్రశ్న వేశారు 

ఇంకొక రెండు వారాల్లో శ్రీనివాస్ తన 34 వ జన్మదినం జరుపుకుపోయే లోపు జరిగిన విషాదం కలసి వేస్తున్నదని ,మా కుటుంభం మొత్తం శోకం లో మునిగి పోయిందని అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నానని నా వేదనకు సమాధానం చెప్పాలని ఈ దేశం లో  భారతీయులు ఎంత మాత్రం  క్షేమం అన్నది చెప్పాలని అన్నారు . 

తెలుగు సంఘాలు ఈ సంఘటనను ఖండిస్తూ సానుభూతి  మెయిల్స్ పంపి సరి పెట్టుకున్నాయి .   

Feb 25 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual