Khichdi News
అమెరికన్ హీరో కి తానా సభలకు ఆహ్వానం !
అమెరికన్ హీరో కి తానా సభలకు ఆహ్వానం !

తన ప్రాణాలకు తెగించి జాత్యహంకార దుండగుడిని  ఎదిరించి  బుల్లెట్లకు తన చేతులడ్డు పెట్టి  మన తెలుగు వాడు  మేడసాని అలోక్ ను కాపాడిన  అయాన్ గ్రిలాట్ తానా ప్రస్తుత ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు తదుపరి ప్రెసిడెంట్  వేమన సతీష్ ల తో కూడిన తానా బృందం ఆదివారం నాడు పరామర్శించింది. కాపాడినందుకు తెలుగు కమ్యూనిటీ తరపున కృతజ్ఞతగా ఆయనను ,అయన కుటుంబాన్ని  సెయింట్ లూయిస్ లో జరుగనున్న 21 వ తానా సభలకు విశిష్ట అతిధిగా ఆహ్వానించింది .  తానా ఆహ్వానాన్ని అయాన్ గ్రిలాట్ మరియు ఆయన కుటుంబ సభ్యులు సంతోషం గా అంగీకరించారు . 

తానా నాయకత్వ బృందం కాన్సాస్  ఇండియన్ సంఘం ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీ మరియు విజిల్ ప్రోగ్రాం కు హాజరై ,కొవ్వొత్తుల ప్రార్థనా సమావేశం లో ప్రసంగించారుఈ సందర్భముగా తానా ప్రెసిడెంట్ జంపాల చౌదరి గారు మాట్లాడుతూ  " భారతీయులకు  ఎప్పుడూ పరమత సహనం అన్నది రక్తం లోనే వుంటుందని ,వారు ఏ దేశం లో వున్నా ఆదేశ  సౌభాగ్యం కోసం పనిచేస్తూ ఉంటారని  అన్నారు .గతవారమే  కాలిఫోర్నియా ఒక తెలుగు విద్యార్థి  షూటింగ్ లో చనిపోగా ఇప్పుడు కాన్సాస్ లో ఇలాంటి దురదృష్ట కరణ సంఘటన జరగడం తో  చాలామంది తెలుగు వారిని ఈ దాడి భయాందోళనకు గురి చేసిందని  కానీ ఒక్కటి చెప్ప దలుచుకొన్నాను 

ఎవడో ఓక  తాగుబోతు డ్రగ్ అడిక్ట్ అయిన దుండగుడు జాతి విద్వేషం తో చేసిన పని  అమెరికాను కానీ అమెరికా ప్రజలను కానీ రిప్రెజెంట్ చేయదని , దానికి తన ప్రాణాలు అడ్డుపెట్టి మనల్ని కాపాడిన  అయాన్ గ్రిలాట్ లాంటి వాళ్ళే అమెరికాను రిప్రెజెంట్ చేస్తారని ,విరాళాల రూపం లో తమ సానుభూతి ని వ్యక్తం చేసిన అమెరికన్లు మనకు ఆదర్శమని అన్నారు . 

అయాన్ గ్రిలాట్ గురించి మాట్లాడుతూ  మీరు ఈ సమావేశం లో లేరు ,మీకు తెలియదేమో మీరు కోట్లాది భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకొన్నారు,వారి ఆశీస్సులు  మీకు అందుతున్నాయి   అని"  భావోద్వేగం తో మాట్లాడారు .  

తానా బృందంనికి   సహకరించిన లోకల్ తెలుగు అసోసియేషన్ సభ్యుల కు,కాన్సాస్ ఇండియన్ సంఘం ప్రతినిధులకు ,మరియు తమతో పాటు వున్న   తుమ్మల ,బిందు ,రాజ్ చీదెలా ,సూర్య లకు తానా ప్రెసిడెంట్ ధన్య వాదాలు  చెప్పారు . 

Feb 27 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual