Khichdi News
ఉత్తర ప్రదేశ్ పీఠం పై యోగి ఆదిత్య నాథ్ !
ఉత్తర ప్రదేశ్ పీఠం పై యోగి ఆదిత్య నాథ్ !

అజయ్ సింగ్ నేగి.. 1972 జూన్ 5వ తేదీన పౌరీ గడ్వాలీ జిల్లా (ఉత్తరాఖండ్)లోని పంచూర్ గ్రామంలో జన్మించారు.. హెచ్‌ఎన్‌బీ గర్వాల్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. హిందూ యువ వాహినిని స్థాపించారు. 12వ లోక్‌సభలో 26 ఏళ్ల పిన్నవయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ గురుంచి సంక్షిప్త పరిచయం ఇది.. 
సన్యాస ధర్మాన్ని పాటిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ మఠాధిపతిగా కూడా ఉన్నారు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు..రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆదిత్య నాథ్ ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయననను కరడు గట్టిన హిందుత్వ వాది అంటారు.. కానీ యోగి ఆదిత్య నాధ్ మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్నారు అన్న విషయాన్ని మరచిపోరాదు.. 
ఆయన యోగి.. ఇప్పుడు రాజయోగి అయ్యారు.. రాజధర్మాన్ని పాటించడం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ విధి.. ఉత్తరప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారు.. దేశంలోనే పెద్దదైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం యోగి ఆదిత్యనాథ్ కు కత్తిమీద సాములాంటిదే.. పేదరికం, అత్యాచారాలు, గుండాయిజం, అవినీతి, ఆరాచకం రాజ్యమేలుతున్న యూపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆదిత్యనాథ్ పై పడింది.. ఆయన చేతితో ఉన్నది మంత్రదండం కాకపోవచ్చు.. కానీ రాజదండంతో  అన్నింటినీ సరిదిద్దగల రనే ఆశిస్తాం !.

Credits : Kranti Dev Mitra

 

Mar 18 2017 | Gopi CH
MOVIE REVIEWS
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.75
3.75/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5
PSV Garuda Vega

PSV Garuda Vega

Director: Praveen Sattaru

Cast: Dr Rajasekhar, Adith, Ravi Var...

Release Date: Nov 02 2017

Editors Rating:
3.50
3.50/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual