Khichdi News
కాటమరాయుడు ఆడియో రిలీజ్ లో పవన్ భావోద్వేగ ప్రసంగం!
కాటమరాయుడు ఆడియో రిలీజ్ లో పవన్ భావోద్వేగ ప్రసంగం!

పవన్ కళ్యాణ్ హీరోగా కిశోర్‌ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రీ–రిలీజ్‌ వేడుక  శనివారం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్‌,TV 9 రవి ప్రకాష్ ,NTV చౌదరి గార్లు  ఆడియో సీడీలను, ట్రైలర్‌ లను విడుదల చేశారు. అభిమానుల అరుపుల మధ్య  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 

పవన్ కళ్యాణ్ ప్రసంగం 

‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. టెక్నీషియన్‌ అవుదామనుకున్నా. హీరో అవుతాననే నమ్మకం అసలు  లేదు.  అది తోట పని కావొచ్చు... వీధులు ఊడ్చే పని కావొచ్చు, ఏ చిన్న పనైనా  గర్వంగా తలెత్తుకొని  నిజాయితీగా చేస్తా. ఈ సినిమాలు భగవంతుడు ఇచ్చిన బహుమానం  అనుకుని ఎంతో నిబద్ధతగా చేస్తూ ,వచ్చిన ప్రతి సినిమా నాలో వుండే భావాల్ని సృశిస్తూ ఉండేలా రావడం నా అదృష్టం,  కష్టపడ డామే నాకు తెలుసు అందుకే  ఇన్నేళ్లూ అంతే కష్టపడ్డాను.

పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ – ‘‘నాకు అన్నయ్య  చిరంజీవి గారే హీరో, నేను కాదు అని అనుకొనే వాడ్ని  

‘సుస్వాగతం’ పెద్ద హిట్టూ  అయిన తర్వాత కర్నూల్‌లో ఫంక్షన్‌కి పిలిచారు. ఇష్టం లేక పోయినా  నేను  వెళ్లకపోతే పొగరనుకుంటారని వెళ్లా. ఐదు కిలోమీటర్లు ర్యాలీగా తీసుకువెళతామన్నారు. ‘అన్నయ్యను చూడడానికి వస్తారు.  కాని  నన్నెవరు చూస్తారు’ అనుకొన్నా .   అయితే  హోటల్‌ బయట రోడ్ల పై విపరీతమైన జనం. ప్రేమతో చేతులు ఊపుతున్నారు. నేను చేతులు జోడించి నమస్కరించా. నా జీవితంలో నేను నేర్చుకున్నవి లేదా అర్థం చేసుకున్నవి కావొచ్చు... అవన్నీ కూడా  నా సినిమాల రూపంలో వచ్చాయి. అది యాదృచ్ఛికమో.. యాక్సిడెంటో.. నాకు తెలీదు. ‘సుస్వాగతం’ క్లైమాక్స్‌లో నిజంగా ఏడ్చాను. ఆ సీన్‌ 40 టేకులు చేశా. అది చేసిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయా.నిజంగా నా తండ్రి చనిపోతే నేనింక ఏడుస్తానా? అనిపించింది.

అలాగే అయింది  ‘జల్సా’   సినిమా  చేసే టైమ్‌లో మా నాన్నగారు చనిపోతే... నాకు ఏడుపు రాలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు. నేను మొదట్నుంచీ ‘మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా. అది మన యువతీ యువకుల్లో ఉన్న శక్తి. ‘నువ్వు ఇది చేయలేవు. నీవల్ల కాదు’ అనే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం ‘తమ్ముడు’ సినిమా. ‘ఖుషి’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు హైటెక్‌ సిటీ థియేటర్‌లో మా టీమ్‌తో కలసి సినిమా చూస్తున్నప్పుడు.. ‘రాబోయే కొన్ని సంవత్సరాలు నీకు గడ్డుకాలం ఉంటుంది. చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి’ అనే భావన కలిగింది. మనసు కీడు శంకించింది. నీరసం, బాధ వచ్చేశాయి.

ఆ రోజు కోల్పోయిన శక్తి ‘గబ్బర్‌సింగ్‌’లో పోలీస్‌ స్టేషన్‌ సీన్‌ చేసేవరకూ పుంజుకోలేకపోయా. అప్పటివరకూ భగవంతుడిని కోరుతూనే వున్న . నేనెప్పుడూ  తమ్ముణ్ణే. నా జీవితంలో ఎవరికీ అన్నయ్యను కాదు. అలాంటిది మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యా మిమ్మల్ని అలరిస్తాను . ప్రతి సినిమా కష్టపడి చేస్తా. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి రిజల్ట్‌ ఇచ్చినా మనస్ఫూర్తిగా తీసుకుంటా’’ అన్నారు.భవిష్యత్తులో ప్రజలు ,అభిమానులు ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజాయితీగా నిక్కచ్చిగా  చేస్తా’’ అన్నారు పవన్‌కల్యాణ్‌. 

త్రివిక్రమ్‌ ప్రసంగం !


అంతకు ముందు  త్రివిక్రమ్‌ మాట్లాడుతూ – ‘‘ కాటమరాయుడు’  ట్రైలర్‌ బాగా నచ్చిందని చెపుతూ పవన్ కళ్యాణ్ ను ప్రశంశలతో ముంచెత్తారు 

ప్రేక్షకుడిలా థియేటర్‌లో సినిమా చూస్తా. చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి... ఇటువైపు వెళ్లమని చెయ్యి చూపిస్తే... అక్కడ ఏముందని ఆలోచించకుండా జనం పరిగెత్తే ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి... ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తారు. అలాంటి ఒక్కడు ఎవరో మీకు  తెలుసు. నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు. ఆయనది  నిలువెత్తు మంచితనం’’ అంటూ పవర్ స్టార్ ను  ఆకాశానికి ఎత్తేశారు . ఊరి చివరనో..ఏటి గట్టు మీదో ఉండే మర్రిచెట్టు వేసవిలో అందరికి నీడనిస్తుంది..వర్షానికి తడుస్తూ పరిగెత్తుకుని వస్తే ఆ చినుకుల నుండి మనల్ని కాపాడుతుంది..కాని ఎప్పుడు మౌనంగా ఉంటూ ఎటువంటి గుర్తింపుని కోరుకోదు..పవన్ కళ్యాణ్ కూడా అటువంటోడే..మౌనంగా ఉంటూ అందరికి నేనున్నానంటూ సహాయం చేసి..ఎటువంటి గుర్తింపుని కోరుకోనటువంటి వ్యక్తీ పవనుడు అంటూ పొగిడేశారు .

నిర్మాత బండ్ల గణేష్ ప్రసంగం 

ఇక గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ,నా దేవుడి గురించి నేనమని చెప్పాలి?

‘‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని బళ్లారి రాఘవ అన్నాడు, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరుతాను బాల గంగాధర్ తిలక్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

కులం యొక్క పునాదులపై ఒక జాతిని కాని, ఒక నీతిని కాని నిర్మించలేం అన్నాడు భారతరత్న డా.బాబాసాహేమ్ అంబేద్కర్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్లన్నాడు సర్‌సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

చిరిగిన చొక్కా తొడుక్కోండి కాని ఒక మంచి పుస్తకం కొనుక్కొండి అన్నాడు కందుకూరి విరేశలింగం, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు, నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యం పతనదినం అన్నాడు మహాత్మా గాంధీ, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్ర్యాన్ని తెచ్చిస్తాను అన్నాడు సుభాష్ చంద్రబోస్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..

ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్‌సింగ్ మళ్లీపుట్టాడని చెప్పమంటారా’’ అంటూ అదిరి పోయే డైలాగ్ లు ముందే బట్టి పట్టి ప్రసంగించారు . 

బండ్ల పొగడ్తలకు పగలబడి నవ్వుతున్న పవన్ మరియు  తివిక్రం 

టీవీ 9  రవి ప్రకాష్

టీవీ 9  రవి ప్రకాష్ మాట్లాడుతూ  గత కొద్ది సంవత్సరాలుగా  నేను పవన్  కళ్యాణ్ అంటే   మీలాగే  బాగా ఇష్ట పడుతున్నా  కారణం ఏమిటంటే  నిస్వార్డం గా  రాజకీయాల్లో  ప్రశ్నిస్తూ 

ముందుకు వెళుతున్న  పవన్ చూస్తే     ఎంతో స్థిర నిశ్శయం తో అడుగులు వేస్తూ  రాజకీయాల్లో పలు మార్పులు తీసుకు వస్తారని భావిస్తున్నాను అన్నారు . 

కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మెగా హీరోలెవ్వ‌రికీ  ఆహ్వానం అందినట్లు లేదు .. నాగబాబు నుంచి సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌ర‌కూ.. ఎవ్వరూ రాలేదు . వేదిక‌పై కాట‌మ‌రాయుడు లో పవన్  సోదరులుగా  నటించిన ఆ నలుగురు (అజయ్ ,కమల్ ,శివ బాలాజీ ) లు మాత్రం ఆలీతో కలిసి  హడావిడి చేశారు 

 

Mar 18 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual