Khichdi News
ఎమ్మెల్సీల అంకెల గారడీలో తిరగబడిన జగన్  !
ఎమ్మెల్సీల అంకెల గారడీలో తిరగబడిన జగన్  !

పోటీ చేసిన అన్ని ఎమ్మెల్సీ లను  తెలుగుదేశం గెలుచుకోంది  చివరికి వైసీపీ మెజారిటీ వున్న కడప ,నెల్లూరు మరియు కర్నూలు జిల్లాలో కూడా విజయం సాధించింది . 

కడపలో 33 ఓట్లు  ,నంద్యాలలో 50 ఓట్ల తేడా,నెల్లూరు లో 85 ఓట్లు తేడాతో వైసీపీ ఓడిపోవడం ఆశర్యకరం కాదు కానీ పార్టీ కి కనీసం కడప కూడా గెలవలేక పోవడం పెద్ద దెబ్బె అని పిస్తుంది .ఎంతో ఉత్కంఠ రేపిన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకప్పుడు 500 మంది పైగా సభ్యులున్న వైసీపీ పార్టీ  33 ఓట్లు తేడాతో  పరాజయం పొందడం వెనుక తెలుగు దేశం ప్రలోభ శక్తీ ఎంత ఉందొ జగన్ మోహన్ రెడ్డి వైఫల్యం కూడా అంత వుంది . 

గతం లో అన్ని అధికారాలు ,స్థానిక  అభ్యర్థుల ఎన్నిక మొత్తం జమ్మల మడుగు  ఇంచార్జి ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి కి ఇవ్వడం అయన అభ్యర్థులే ఎక్కువమంది గెలవడం  అయన తెలుగుదేశం లోకి మారి మొత్తం తను గెలిపించిన తన  అనుచరులతో పాటు మిగిలిన వారిని ప్రలోభ పెట్టి ఎక్కువ ఓట్లు తెలుగుదేశం వైపు మళ్ళించాడు . 

ఇక జగన్ అప్పట్లో  దివంగత నేత  భూమా నాగిరెడ్డి కి రాయలసీమ లో పలు భాద్యతలు అప్పగించడం తో అయన కడప లోని  బంధువులు మరియు ఆయనను ఆశ్రయించిన అభ్యర్థులకు  స్థానిక ఎన్నికల్లో ఉదారంగా సీట్లు ఇప్పించడం తరువాత  వారంతా తెలుగు దేశం లో  చేరడం విదితమే . అయితే జగన్ మోహన్ రెడ్డి భూమా అంత్యక్రియలకు హాజరు కాకపోవడం కూడా కొంత ప్రభావితం భూమా ద్వారా  సీట్లు పొందిన వారు  తెలుగుదేశం వైపు మొగ్గడానికి  దోహదం చేసినదని  తెలుస్తున్నది .  పైగా బాబాయి వివేకానంద రెడ్డి ని  ని గతం లో అన్ని విధాలుగా   అణచి వేచి గత ఎన్నికల సమయం లో డమ్మి చేసేయడం  ఇప్పుడు ఒక్కసారిగా  ఎమ్మెల్సీ అభ్యర్థిగా  నిలబెట్టడం కూడా  అభ్యర్థుల్లో  ఆసక్తి కలిగించలేదని భావిస్తున్నారు . బీటెక్ రవి లాంటి అర్బకుడి చేతిలో సీనియర్ నేత వైస్  వివేకానంద రెడ్డి ఓడిపోవడం విశేషం .  

జగన్  తన అభ్యర్థులు ,తనవల్ల గెలిచిన వారు పైగా తమ కుటుంభం సభ్యులను నిలబెడితే అధికార పక్షం ప్రలోభం , డబ్బులకు లొంగకుండా  ఖఛ్చితంగా క్రాస్ ఓటింగ్ చేస్తారని భావించడం స్వయంగా జమ్మలమదుకు వెళ్లి క్యూ లో నిలబడి మరి  ఓటు వేయడం ,తన నమ్మకం పై కడప అబ్యర్దులు  దెబ్బ కొట్టడం  జగన్ కి మొట్టమొదటి సారి తన స్వంత జిల్లాలో పరాభవం కన్నీళ్లు మిగిల్చిందనే చెప్పాలి . 

ఇక వైఎస్‌ఆర్‌, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు సాధించింది. ఈ మూడు జిల్లాల్లో ఇప్పటికి వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ఐనా అధికార పక్షం రాజకీయ ఎత్తుగడలతో వైసీపీ ని  ఓడించిందనే చెప్పాలి . రాజకీయాల్లో ఇకమీదట  పార్టీలు, అభిమానాలు ,నమ్మకాలు వుండవు తమ  అవసరాలు మాత్రమే ప్రధానం,దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సూత్రం  ను అనేక  జిల్లాలలో  స్థానిక అభ్యర్థులు  అనుసరించారు . ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి 15 నుంచి 25 లక్షల రూపాయల వరకు ముట్టినట్లు  తెలుస్తున్నది  . 

 



 

Mar 20 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
  • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
    ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
  • నాడు -నేడు .. మీడియా తీరే...
    మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
  • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
    ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
  • గురువుకు బుద్ది చెప్పిన స...
    ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
  • ఫోటో కామెంట్ !...
    పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual