Khichdi News
భగవంతుడు అంటే ఎవరు?

భగవంతుడు అంటే ఎవరు?
ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు.

మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే…

పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.

ఉదాహరణకు…
– మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
– మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
– మన కళ్ళు…అతి విసృతమై న పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శిని ని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారు కదా..అని మీరు అడగవచ్చు.
– కళ్ళు భౌతికమైన పదార్ధాల ను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తుంది. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు.

తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనో నేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.

ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

– ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచ భౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడం వల్ల, అగ్నిని కళ్ళతో చూడగల మే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలం టే మన మనో నేత్రాన్ని తెరవాలి.

దాన్ని తెరవాలంటే…, పాంచ భౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.

Mar 21 2017 | Satish Vemuri
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual