Khichdi News
డాలస్ ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కి NRI ల బ్రహ్మరధం !
డాలస్ ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కి NRI ల బ్రహ్మరధం !

నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక తొలిసారిగా అమెరికా విచ్చేసిన తమ ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి అమెరికాలోని తెలుగు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ప్రవాసఆంధ్రులను నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం లో భాగస్వామ్యులను చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన  ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సమాఖ్య ( ఎపి ఎన్ ఆర్ టి ) ఆధ్వర్యంలో జన్మభూమి, ప్రవాస తెలుగుదేశం పార్టీ  (ఎన్నారై టిడిపి) సహకారంతో డల్లాస్ లో చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా జరిగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలనుండి, టెక్సాస్ రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు ఐదు వేల మంది పైగా ఈ సభకు వచ్చి చంద్రబాబు  ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు.

 

ముఖ్యమంత్రితో పాటు హ్యూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు. వాణిజ్య శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి సలహాదారుడు పరకాల ప్రభాకర్ , ముఖ్యమంత్రి ప్రిన్సిపల్  సెక్రటరీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.

 

ముఖ్యమంత్రి సభలోకి అడుగు పెట్టగానే జై చంద్రబాబు అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. అమెరికాలోని సాఫ్ట్ వేర్ కంపెనీల సమాఖ్య ఐ టీ సర్వ్ అధ్యక్షులు సతీష్ మండువ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడుతూ ఆయనను వేదిక పైకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి దాదాపు నలభైఐదు నిమిషాలు ప్రసంగిస్తూ మొదటగా రాష్ట్ర విభజన జరిగిననాటి పరిణామాలను గుర్తు చేస్తూ, గత మూడేళ్లలోనూ రాష్ట్రం ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్రగతిపథంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉందన్నారు కేవలం సాంకేతిక, విజ్ఞాన రంగాలు కాకుండా పేద ప్రజలకు, ఆడవారికి ఇతర బలహీన వర్గాలకి ప్రయోజనం కల్పించటానికి ఎన్నో పధకాలు చేపట్టామన్నారు. విన్నూత్నమైన ఆలోచనలతో తక్కువ ఖర్చుతో ఎంతో విలువైన ప్రాజెక్టులను పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. విశాఖలో ఎల్ ఈ డీ దీపాలను ఏర్పాటు చేసి నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించామని అలాగే రాష్టంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఏర్పాటు చేసే దిశగా అతి తక్కువ వ్యయంతో ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ఏర్పాటు చేయటం జరుగుతొందని చెప్పారు . ప్రపంచీకరణ ఫలితాలను అందిపుచ్చు కొనే దిశగా ఉమ్మడి రాష్ట్రంలో తాను  చేపట్టిన పధకాలు యువత సాంకేతిక విద్యలు నేర్చుకొని విదేశాలకు వెళ్లేలా ప్రొత్సాహం ఇఛ్చాయని గుర్తు చేశారు. అలా వఛ్చిన యువత ఉద్యోగాలతో సరిపెట్టుకోకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆర్థికంగా కూడా  పటిష్టం కావాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ, ముఖ్యమంత్రి , రెండంకెలకు చేరువలో ఉన్న ఉత్పాదక శక్తి తో భారత దేశం ముందుకు దూసుకు పొతొందని , ప్రవాసులు స్వంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి తరుణం దొరకదని చెప్పారు. చిత్ర నిర్మాణ రంగంలో తెలుగు వారి శక్తిని ప్రపంచానికి చాటిన బాహుబలి చిత్రాన్ని గుర్తు చేస్తూ ప్రతీ యువకుడూ ఒక బాహుబలి కావాలన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో తనపై ఎంతో  నమ్మకం ఉంచిన రైతులు, నలభై వేల ఎకరాలను పైసా ఆశించకుండా ఇచ్చివేశారని, వారి నమ్మకాన్ని తాను  వమ్ము చేయనని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మూడు గొప్ప రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ని నిలుపుతామని, 2029 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు మీ అందరి సహకారం కావాలని చెప్తూ సభలోని వారందరి కరతాళధ్వనుల మధ్య తన ప్రసంగాన్ని ముగించారు.

 

 APNRT సిఈవో డా. రవి వేమూరు తమ ప్రసంగం కొనసాగిస్తూ నూతన రాష్ట్ర నిర్మాణంలో ప్రవాసంలోని తెలుగువారు పాల్గొనేలా తాము అందిస్తున్న తోడ్పాటును వివరించారు. గ్రామాలను దత్తత తీసుకొని త్రాగు నీరు, వీధి దీపాలు, పాఠశాలలకు పక్కా భవనాలు మరియు ఇతర ప్రాధమిక సౌకర్యాలను మెరుగు పరచడంలో ప్రవాసుల పాత్రను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు  ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటులు అందిస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర అమెరికాలో జన్మభూమి కార్యక్రమ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ ఎన్నారైలు జన్మభూమి కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు తోడ్పడుతున్నట్లు చెప్పారు.

సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దాదాపు 20 అడుగుల ఎత్తైన తెలుగు తల్లి విగ్రహం, కొండపల్లి బొమ్మలు అందరినీ అబ్బుర పరిచాయి. . కార్యక్రమ ప్రారంభంలో ఇండియన్ ఐడల్ గా ఇటీవల ఎంపికైన రోహిత్, యువ గాయని అంజనా సౌమ్య తమ గాత్రంతో అందరినీ అలరించారు. క్లాసికల్ మరియు ఫ్యూజన్ డ్యాన్స్ ప్రదర్శనలను  డాక్టర్ సుధా కల్వగుంట, హేమా చావలి, రూప బండ, యోగిత మండువ మరియు స్వప్న గుడిమెళ్ళ  రూపకల్పన చేసారు. ఈ నృత్యకార్యక్రమంలో 70 మందికి పైగా చిన్నారులు  పాల్గొన్నారు.

 

అంతకు ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్సాస్ స్థావరంగా ఉన్న అతి పెద్ద కంప్యూటర్ తయారీ సంస్ధ  డెల్  కార్పొరేషన్ మరియు హెలికాఫ్టర్ సంస్థ బెల్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని ఆహ్వానించారు. . ఐటి సర్వ్ సమాఖ్య లోని 28 పైగా సంస్థల ప్రతినిధులు  ముఖ్యమంత్రిని కలిసి తమ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు హామీ ఇచ్చారు.

 

 

కార్యక్రమం చివరలో నిర్వాహకులు వందన సమర్పణ చేస్తూ, టెక్సాస్ కు చెందిన నూటయాభై  మందికి పైగా స్వచ్ఛంద సేవకుల కృషితో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించగలిగామని తెలిపారు. వీరిలో సురేష్ మండువ (APNRT సౌత్ వెస్ట్ రీజియన్ అడ్మినిస్ట్రేటర్), కృష్ణ కోరాడ (APNRT కోఆర్డినేటర్), సతీష్ కొమ్మన  (APNRT కోఆర్డినేటర్), అజయ్ గోవాడ  (APNRT కోఆర్డినేటర్), సాంబా దొడ్డ (APNRT కోఆర్డినేటర్), అమర్ అన్నే(APNRT కోఆర్డినేటర్), కిషోర్ చలసాని (ఎన్ఆర్ఐ-టిడిపి కోఆర్డినేటర్), దినేష్ త్రిపురనేని (ఎన్ఆర్ఐ-టిడిపి కోఆర్డినేటర్), రత్న ప్రసాద్ గుమ్మడి (ఎన్ఆర్ఐ-టిడిపి కోఆర్డినేటర్), శ్రీకాంత్  పోలవరపు (ఎపి జన్మభూమి కోఆర్డినేటర్ ) సుధాకర్ పెన్నం, రామకృష్ణ మార్నేని, రాజా మాగంటి, వినోద్ ఉప్పు, జనార్థన్ ఎనిగేపాటి, సుధాకర్ కంచర్ల, కెసి చేకూరి, శ్రీనివాస్ కొమ్మినేని, శేషారావు బొడ్డు, సుభాష్ నెలకంటి, సుబ్బారావు పొన్నూరు, రాజేష్ ఆడుసుమిల్లి, సురేశ్  కాజా, చంద్రహాస్ మద్దుకూరి, లక్ష్మీ పాలేటి, రాజేష్ చిలుకూరి, రామకృష్ణ నిమ్మగడ్డ, వీణ యలమంచిలి, పరమేశ్ దేవినేని, సురేష్ పత్తిపాటి , శ్రీకాంత్ పువ్వాడి, చైతన్య కంచర్ల మరియు ఇతర చురుకైన వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. మీడియా భాగస్వాములుగా తోడ్పాటు అందించిన టీవీ 5, టివి 9, ఫన్ ఏషియా, ఏక్ నజర్ మరియు మనోహర్ నిమ్మగడ్డ(దేశీ ప్లాజా)కు తమ ధన్యవాదాలు తెలిపారు.  తమ సంగీత, నృత్య కార్యక్రమాలతో అలరించిన గాయనీగాయకులకు, నృత్య దర్శకులు మరియు చిన్నారులకు కార్యక్రమ నిర్వాహకులు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సలహా సంఘ సభ్యులుగా అమెరికాలోని తెలుగు సంఘాల స్థానిక ప్రముఖులు  ప్రసాద్ తోటకూర , డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి, డాక్టర్ రమణారెడ్డి గూడూరు, రామ్ యలమంచిలి, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, డాక్టర్ శ్రీనివాస్ పొట్లూరి, డాక్టర్ చంద్ర పెమ్మాసాని, మురళి వెన్నం, నీల్ గోనుగుంట్ల, సంధ్యా రెడ్డి గవ్వ, మహేందర్ గణపరం, డా. రాజు కోసూరి, శ్రీనివాస్ కోనేరు, ఉపేంద్ర తెలుగు, అరవింద్ రెడ్డి ముప్పిడి, సతీష్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అళ్ళ , విక్రం జంగం, రమణారెడ్డి క్రిష్టపాటి, ఆర్.కె. పండిట్, భాస్కర్ రాయవరం మరియు  శ్రీధర్ కొడెల తమ సహకారాన్ని అందించారని వారందరికీ  తమ కృతఙ్ఞతలు తెలిపారు.

బహిరంగ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం ఎన్నారై శాఖ తో సమావేశమయ్యారు. ఎన్నారై కార్యకర్తల సేవలను గుర్తించి వారికి వచ్ఛే ఎన్నికల సమయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని ఆయన చెప్పారు.

 

 

Photo gallery:

http://www.kvimages.com/IT-Serve-CBN-2017/

May 11 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual