Khichdi News
అమెరికా స్వాతంత్ర దినోత్సవం July 4th రోజున స్వామి వివేకానందుని మహానిష్కమణ !
అమెరికా స్వాతంత్ర దినోత్సవం July 4th రోజున స్వామి వివేకానందుని మహానిష్కమణ !

అమెరికా తో స్వామిజి కి ఏర్పడిన విశ్వ మత సభల ఆధ్యాత్మిక అనుభందం, స్వామిజి ఆధ్యాత్మిక జైత్ర యాత్ర అమెరికా ప్రజలతో పాటు తన భారతీయుల మది లో ఎంతో స్పూర్తి ని,ఆత్మ విశ్వాసాన్ని ,ఒక ఆదర్శాన్ని నింపి నిద్రావస్తలో వున్న భారతీయులను మేల్కొలిపి కార్యోన్ముకులను చేసాయి . ఎందరో స్వతంత్ర సమరయోధులు స్వామిజి ప్రసంగాలు,రచనల ద్వారా ఉత్తేజితులై స్వాతంత్రము కోసం పోరాడి కొంత కాలానికి విజయం సాదించారు .

స్వామిజి అమెరికన్ స్వాతంత్ర దినం రోజు జూలై 4th 1902 నాడు భౌతికముగా మహా సమాధి అయ్యారు . ఆశ్యర్య కరముగా మహా సమాధికి నాలుగు సంవత్సరాల క్రితం 4th of July 1898 నాడు అమెరికన్ శిష్యులతో కలసి కాశ్మీర్ పర్యటనలో వున్నప్పుడు .ఒక అమెరికన్ భక్తు రాలు స్వామిజి ని అమెరికన్ స్వతంత్ర దినం రోజు సందేశం ఇవ్వమని అడిగితె,వెంటనే అయన ప్రేమతో జూలై 4 వ తేది అమెరికన్ స్వాత్రంత్రదినాన్ని గురించి అద్భుతమైన పద్యం ఇంగ్లీష్ లో వ్రాసి శిష్యులచే చదివించారు

స్వామిజి అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున అమెరికన్ భక్తుల కోసం తనని ఆదరించిన అమెరికా దేశం పై అద్భుతముగా ఒక గీతం రాసి అమెరికాకు అంకిత మిచ్చారు .
స్వామిజి కి  అమెరికన్ మహిళ లు అంటే ఎంతో గౌరవం, తనను అమెరికాలోదేవుడిచ్చిన తల్లుల వలె ఆదరించి కాపాడిన అమెరికన్ మాతలు అంటే ఎంతో కృతజ్ఞత భావం !.
అమెరికాస్వాతంత్రము పై అయన కవితా ప్రవాహం ఇలా పొంగి పొర్లింది .

Fourth Of July, Poem By Swami Vivekananda

Behold, the dark clouds melt away,
That gathered thick at night,and hung
So like a gloomy pall above the earth!
["రాత్రి గాఢముగా క్రమ్మి భూమి పై విషాద యావని కల్లా వేలాడుతున్న
కారు మేఘాలు ఎలా కరిగిపోతున్నాయో చూడు ]

Before thy magic touch,the world Awakes.
The birds in chorus sing.
The flowers raise their star-like crowns-
Dew-set, and wave thee welcome fair.

నీ అమృత స్పర్శతో జగత్తు మేల్కొనుచున్నది ,పక్షులు ఐక్య కంఠ ముతో పాడుతున్నాయి !
శశిరచ్చాదిత ప్రసూనాలు నక్షత్ర మండిత మకుటాలతో తల ఎత్తి నీకు సుస్వాగతము పలుకుతున్నాయి .

 

The lakes are opening wide in love
Their hundred thousand lotus-eyes
To welcome thee, with all their depth.
All hail to thee, thou Lord of Light!

[నిన్ను ఆహ్వానించుటకై శత కోటి కమల నయనాలతో సరస్సులు తమ హృదయాంతరాల
నుండి ప్రేమ భాహువులను ప్రసరించు చున్నాయి]

A welcome new to thee, today,
O sun! today thou sheddest LIBERTY!
Bethink thee how the world did wait,
And search for thee, through time and clime.

[ధీర మణి నీకు విజయోస్తు భాస్కర ! మారోసారి ఈనాడు
నీకు నవీన ఆహ్వానం నేడు నీవు స్వతంత్రం కురిపిస్తున్నావు !
దీర్ఘ కాలం నుండి ప్రపంచమంతా నిన్ను గాలిస్తూ ,నీ కొరకు తహ తహతో ఎలా నిరీక్షించి వుందో ఒక్కసారి అలోచించి చూడు]

Some gave up home and love of friends,
And went in quest of thee, self banished,
Through dreary oceans, through primeval forests,
Each step a struggle for their life or death;
[ఎంతో మంది గృహాన్ని ,మిత్ర ప్రేమను పరిత్యజించి స్వయం గా
గంభీర సముద్రాలూ దాటుతూ ,దట్ట మైన అరణ్యాల లో నడుస్తూ
వేచిన ప్రతి అడుగు జీవన్మరణ సమస్య గా నీ అన్వేషణలో మునిగి పోయారు]

Then came the day when work bore fruit,
And worship, love, and sacrifice,
Fulfilled, accepted, and complete.
Then thou, propitious, rose to shed

[వారి పరిశ్రమ పలిచిన ఒక్క సుదినం వచ్చింది వారి పూజ ,ప్రేమ ,త్యాగం స్వీకరించ బడ్డాయి ,పరి పూర్ణతను పొందాయి .నువ్వు అత్యంత ప్రీతి మంతుడవు అయ్యావు ]

The light of FREEDOM on mankind.
Move on, O Lord, on thy resistless path!
Till thy high noon o'erspreads the world.
Till every land reflects thy light,

Till men and women, with uplifted head,
Behold their shackles broken, and
Know, in springing joy, their life renewed

మానవాళి పై "స్వంతంత్ర జ్యోతి ని వెదజల్లడానికి లేచావు
నీ మద్యాహ్నపు దినపు ఖరకిరణాలు ప్రపంచాన్నంతా ముంచెత్తెవరకు
,ప్రతి దేశము నీ క్రాంతిని ప్రతిబింబించే వరకు ,
స్రీ పురుషులు అందరు ఎత్తిన తలలతో తమ సంకెళ్ళు సడల బడి ,
తమ జీవితాలు క్రొత్త ఆనందముతో సరి కొత్త గా చూసేంత వరకు
ప్రభూ ! నీ దివ్యమైన పధం లో పయనించు . అసంఖ్యాక సుభాశిస్సులు !


జూలై 4th 1902 న మహాసమాధి చెందినా స్వామిజి వివేకానంద భౌతికముగా తన చివరి ఏడు రోజులు బేలూరు మఠ్ లో ఇలా గడిపారు
------------------------------------------------------------------------------------------------------------
శిష్యులు తమ కార్యనిర్వహణలో సమస్యలు చెప్పు కోవడానికి అయన దగ్గరకు వచ్చినపుడు సున్నితముగా తిరస్కరించి "ఇంకా నేను బౌతిక విషయాలలో నన్ను తలదూర్చనియద్దని ,శిష్యులు తమ నాయకుడు వారితో లేనపుడే వారి సామర్ద్యము వెలువడుతుందని మీ ప్రకారం మీరు ప్రయతించండి అని చెప్పి ,నేను భగవంతుని లో ఇక్యానికి దగ్గరగావున్నాను అని చెప్పారు .

మూడు రోజులకు ముందు ఏకాదశి రోజున సోదరి నివేదిత కు తన స్వహస్తాలతో భోజనము వడ్డించి,తినిపించి ,ఆమె చేతులు కడుగుకోడానికి తనే నీళ్ళు,తువ్వాలు ఇచ్చారు ,సోదరినివేదిత స్వామిజి ని ఏమిటి స్వామి మీరు ఇలా  అని వారిన్చినపుడు ,ఆమెతో స్వామి ఇలా అన్నారు " ఏసు ప్రభువు తన భక్తుల పాదలను స్వయంగా కడిగారు కదా అన్నారు ". వెంటనేనివేదిత స్వామిజి ఇదే చివరి సారి ఇలా అనభోయీ ,క్షణంలో తమాయించుకున్నారు ఆమెకు ఏదో చెడు స్పురించినది (మహాసమాధి) .కాని అదే చివరిది అయినది.

చివరి రోజు 4th జూలై నా స్వామిజి ఎప్పటికంటే ముందుగా ఉదయాన్నే లేచి ధ్యాన మందిరం లోకి వెళ్లి తలుపులు గట్టిగా బంధించుకొని ౩ గంటలు ధ్యానములో గడిపారు తన రోజువారి పనులకు విరుద్దగాముగా.తరువాత ఆనందముగా ,తన్మయత్వముతో మెట్లు దిగుతూ జగజ్జనని కాళిమాతా పై అద్భుతమైన పాట పాడారు,కొద్దిచేపు తరువాత తనలో తనుమాట్లాడుకొంటూ "ఇంకొక వివేకానందుడు వుంటే ,అయన మాత్రమే ఈ వివేకానందుడు చేసిన కార్యాలు అర్దమై ఉండేవి ,ఆయినా ఎన్ని మంది వివేకనందులు పుడుతారు ఎంతోకాలానికి గాని " అన్నారు .

సాయంతం స్వామి ప్రేమానంద తో కలసి దాదాపు రెండు మైళ్ళు నడుస్తూ వేద కాలేజీ ప్రారంభించడానికి కొన్ని చూచనలు చేసారు .చివరగా మాట్లాడుతూ భారత దేశంఆద్యాతమక,పుణ్య దేశం ,భారత దేశం స్తిరంగా నిలబడేది భగవంతుని అన్వేషణలోనే ,ప్రపంచానికి భగవంతుని అన్వేషణ గూర్చి తెలెయ చెప్పడమే కాని ఇది రాజకీయాలలో,సాంఘిక విషయాలలో తలడూర్చకూడదు.

స్వామిజి సాయత్రం ఏడు గంటలకు అయన రూం లోకి వెళ్లి శిష్య్లని ఆయనను పిలిచేదాకా రావద్దని చెప్పి వెళ్లారు . ఒక గంట ధ్యానం తరువాత అందరిని పిలిచి తలుపులు కిటికీలుతీసి ,అయన పడక పై పనుకొన్నారు. ఒక గంట తరువాత అయన గట్టిగా భారం గా శ్వాస పీల్చారు .మరల కొద్ది సెకండ్ల తరువాత అదేవిధముగా శ్వాస పిల్చి శరీరాన్ని వదిలారు.అయన తన సోదర శిష్యులతో తరచు చేపుతుందే వారు తానూ 40 వ జన్మదినం జరుపుకోలేనని,చివరకు అదే నిజమవుతూ ౩౦ సంవస్తరాల 5 నెలల ఇరవై నలుగు రోజులుబౌతికముగా జీవిచారు.
ఎక్కడా కూడా అయన మహాసమాధి ,వర్దంతి లు జరుపము ఎందుకంటే స్వామి వారు బౌతికముగ ,శారీరకం గా మనకు దూరమయ్యారు కాని అయన రగిలించిన స్పూర్తి ,ఆయనరచనలు ,అయన ఏర్పాటు చేసిన శ్రీ రామకృష్ణ మఠ్ లు భారతీయులకు తరతరాలుగా ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూపిస్తూనే వుంటాయి . ప్రపంచ యువతకు అయన సందేశాలుమార్గదర్శకాలు అవుతాయి .

Jul 04 2017 | Gopi CH
MOVIE REVIEWS
YAATRA

YAATRA

Director: Mahi V Raghav

Cast: Mammootty, Rao Ramesh, Jagapa...

Release Date: Feb 08 2019

Editors Rating:
3.72
3.72/5
NOTA

NOTA

Director: Anand Shankar

Cast: Vijay Devarakonda, Mehreen Pir...

Release Date: Oct 04 2018

Editors Rating:
3.00
3.00/5
Neevevaro

Neevevaro

Director: Harinath

Cast: Aadhi Pinisetty, Ritika Singh,...

Release Date: Aug 23 2018

Editors Rating:
3.25
3.25/5

PHOTO GALLERY

PHOTO COMMENT
 • ఫోటో కామెంటు కొట్టు గురూ ...
  ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ...
 • నాడు -నేడు .. మీడియా తీరే...
  మన పత్రికల దృష్టిలో నేతల పై రాతలు కాలానుగుణంగా మారుతూ వుంటాయి . అప్పట్లో వాజపేయి ని Good Man in Wrong Party అనే ...
 • ఫోటో కామెంట్ కొట్టు గురూ ...
  ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ...
 • గురువుకు బుద్ది చెప్పిన స...
  ధన్యవాద్ అరుణ్ జెట్లీ సాబ్ ..! నేల కేసి కొట్టినాబంతి లా పైకి వచ్చా ! మీ పుణ్యం పంజాబ్ ఉపముఖ్యమంత్రి ...
 • ఫోటో కామెంట్ !...
  పాపం ప్రశాంత్ కిషోర్ యూపి లో గెలుపుకోసం రాహుల్ ,అభిషేక్ లను కలిపాడు ప్రియాంకను రప్పించాడు ప్రజలకు మంచాలపై చర్చలు పెట్టాడ ...

Spiritual